Sunny Leone: భారతీయ వెండితెర పై శృంగార తారగా ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంది. అయితే, ఇప్పుడు సన్నీ లియోన్ ని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆన్ లైన్ కేటుగాళ్లు ఆమెను బురిడీ కొట్టించారు. ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ఆన్ లైన్ లో లోన్ తీసుకున్నారు. ఈ విషయం ఆమె ట్వీట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది.
ఈ విషయమై ఆమె బ్యాంక్ అధికారులను సంప్రదించగా, వారు సన్నీని మోసం చేసిన వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారు. అనంతరం సన్నీ బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది. మొత్తానికి హాట్ బ్యూటీ సన్నీ లియోనీ మోసపోయింది అన్నమాట. ఇక గత వారం సోషల్ మీడియాలో సన్నీ లియోన్ కి వ్యతిరేకంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: భీమ్లానాయక్‌ను మిస్ చేసుకున్న డైరెక్టర్ ఇతనే.. ఆ హీరో కారణంగానే..!
ముఖ్యంగా కొంతమంది బీజేపీ నాయకులు సన్నీ లియోన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ గొడవ అంతా దేనికి ? సన్నీ లియోన్ నటించిన ఒక పాట బాగా వివాదాస్పదం అయింది. “మధుబన్ మే రాధ” అనే పాటలో సన్నీ లియోన్ కనబడింది. నెటిజన్లు ఆ పాటను తెగ వైరల్ చేశారు. నిజానికి అది శ్రీకృష్ణుడి కోసం రాధ పాడే భక్తి గీతం.
1960లో విడుదలైన కోహినూర్ అనే సినిమాలో మహ్మద్ రఫీ పాడిన ఆ పాటని సన్నీ లియోన్ పై లేటెస్ట్ గా రీమిక్స్ చేసి జనం పైకి వదిలారు. ఒక భక్తి గీతాన్ని ఒక శృంగార తార పై ఎలా తీస్తారు ? అసలు ఆ శృంగార తార ఆ భక్తి గీతంలో ఎలా నటిస్తోంది ? అంటూ హిందుత్వ వాదులు సన్నీ లియోన్ పై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలోనే ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.
అయినా భక్తి గీతంలో సన్నీ లియోన్ ఎందుకు నటించకూడదు. సన్నీ లియోన్ కేవలం నటి మాత్రమే. ఆమెతో ఆ సాంగ్ తీసిన దర్శక నిర్మాతలను అడగాలి. అంతేగాని.. సన్నీ లియోన్ పై పడితే ఉపయోగం ఏముంది ?
Also Read: కేసీఆర్ సార్ మేడారం రాకపోయే.. విమర్శల జడివాన మొదలాయే!