https://oktelugu.com/

Sunny Leone: పెళ్లికి ముందు ప్రియుడు చేసిన ఆ దారుణాన్ని బయటపెట్టిన సన్నీలియోన్

బుల్లితెరపై ప్రసారమయ్యే" స్ప్లిట్స్ విల్లా" అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదవ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షో కు సంబంధించి తాజా ఎపిసోడ్ ఇటీవల ప్రసారమైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 7, 2024 / 03:27 PM IST

    Sunny Leone

    Follow us on

    Sunny Leone: శృంగార తారగా, పెద్దల చిత్రాల నటిగా సన్నీలియోన్ సుపరిచితురాలే. భారతీయ మూలాలు ఉన్న ఈ కెనడియన్ నటి బాలీవుడ్ లో ప్రత్యేక గీతాలలో నర్తించింది. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, మలయాళ భాషల్లో పలు పాటల్లో మెరిసింది. కరెంట్ తీగ అనే సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. చివరగా మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా అనే తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్నిలియోన్ చేతిలో 8 వరకు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒక సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించనుంది. మిగతా సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తోంది. వెండితెరే కాకుండా బుల్లితెరపై కూడా సన్నిలియోన్ సందడి చేస్తోంది.

    కాళ్ళకింది భూమి కదిలిపోయింది

    బుల్లితెరపై ప్రసారమయ్యే” స్ప్లిట్స్ విల్లా” అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదవ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షో కు సంబంధించి తాజా ఎపిసోడ్ ఇటీవల ప్రసారమైంది. ఈ సందర్భంగా సన్నీలియోన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంది. ” నా పెళ్ళికి ముందు ఈ సంఘటన జరిగింది. అప్పుడు నేను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అతడు కూడా నన్ను అదేవిధంగా ఇష్టపడ్డాడు. ఇద్దరం చాలా రోజులపాటు కలిసి ఉన్నాం. అదే సమయంలో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. ఆ తర్వాత అతనిలో క్రమంగా మార్పు మొదలైంది. నాకెందుకో అనుమానం వచ్చి అతడిని నిలదీశాను. నామీద నీకు ప్రేమ ఉందా? అని అడిగాను. దానికి అతడు ఎప్పుడో చచ్చిపోయిందని సమాధానం చెప్పాడు. ఆ సమాధానంతో నా కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్టు అనిపించింది. అప్పటికే మా పెళ్ళికి సంబంధించిన దుస్తులు, నగల కొనుగోలు కూడా పూర్తయింది.

    అన్ని బుక్ చేశాను

    హవాయి దీవుల్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఆ పెళ్లి జీవిత మొత్తం గుర్తుండిపోయేలా జరగాలని ప్రణాళికలు రూపొందించుకున్నాం. దానికోసం అన్ని బుక్ చేశాను. డబ్బులు కూడా భారీగా ఖర్చు పెట్టాను. పెళ్లికి ఇంకా రెండు నెలల సమయం ఉందనగానే నేనంటే ఇష్టం లేదని చెప్పాడు. నా మనసును ముక్కలు చేశాడు. అప్పుడు నేను నరకం అనుభవించాను. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. దాని నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించాను. ఆ సమయంలోనే భగవంతుడు నా మీద దయతో వెబర్ ను నా వద్దకు పంపాడు. నేనంటే ఏంటో అతనికి తెలుసు. నా అమ్మానాన్న మరణించినప్పుడు వెబర్ నా పక్కన ఉన్నాడు. దుఃఖ సమయంలో నాకు తోడుగా నిలిచాడు. నాకు ధైర్యవచనాలు చెప్పాడు. నేను ఎప్పటికీ నా భర్తతోనే ఉంటాను. అతడి చెయ్యి వదలను” అని సన్నీలియోన్ భావోద్వేగానికి గురైంది. సన్నీలియోన్, వెబర్ 2011లో వివాహం చేసుకున్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఆ మరుసటి సంవత్సరం సరోగసి ద్వారా నోవా, ఆషర్ మగ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.