Sunitha Williams
Sunitha Williams : అంతరిక్షం లోకి ప్రయాణం చేసి, కేవలం 9 రోజుల్లో తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్, 9 నెలలు పూర్తి అయినా తిరిగి రాకపోవడం ఎంత పెద్ద దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో,. నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియా లో ఎక్కడ చూసిన సునీత విలియమ్స్ పేరు మనకు ఈమధ్య కాలంలో వినిపిస్తూనే ఉంది. అయితే ఎలాన్ మస్క్ డ్రాగన్ క్యాప్సల్ ని అంతరిక్షం లోకి పంపించి, సురక్షితంగా సునీత విలియమ్స్(Sunita Williams) ని భూమి మీదకు నేడు ల్యాండ్ అయ్యేలా చూసాడు. ఆమె సురక్షితంగా భూమి మీదకు వచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యంగా సునీత మన ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన అమ్మాయి కావడంతో, మన ఇండియన్స్ ఈ సందర్భంగా ఆమెకు లక్షల సంఖ్యలో సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
Also Read : గణపతి ప్రతిమతో అంతరిక్షంలోకి.. సునీత విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇది ఇలా ఉండగా ఆమె భూమి మీదకు వచ్చి పట్టుమని రెండు మూడు గంటలు కూడా కాలేదు, అప్పుడే ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఒక సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఒక ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సునీత విలియమ్స్ మీద బయోపిక్ తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో సునీత క్యారక్టర్ లో అనుష్క శెట్టి(Anushka Shetty) నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. ఒక గొప్ప సంకల్పంతో అంతరికంగా లోకి ధైర్యంగా అడుగుపెట్టిన సునీత విలియమ్స్, 9 నెలల వరకు అన్నం, నీళ్లు లేకుండా ఎలా అంతరిక్షం లో జీవించింది. ఆ సమయంలో ఆమె ఎదురుకున్న కష్టాలు ఏమిటి అనే అంశాలను తీసుకొని ఈ చిత్రం తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్(Krish Jagarlamudi) వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఒకవేళ నిజమైతే అనుష్క ఈ క్యారక్టర్ కి ఎంపిక చేయడం సరైన నిర్ణయం అని చెప్పొచ్చు.
ఈమధ్య కాలంలో ఇలాంటి బయోపిక్ సినిమాలకు మన ఇండియన్ ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. మన టాలీవుడ్ సంగతి పక్కన పెడితే, బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు క్లిక్ అయితే కుంభస్థలం బద్దలు కొట్టినట్టే లెక్క. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది. ముందుగా దర్శక నిర్మాతలు కొన్నిరోజులు అయ్యాక సునీత విలియమ్స్ ని కలుస్తారట. ఆమె అనుభవాన్ని మొత్తం రికార్డు చేసుకున్న తర్వాతనే స్క్రిప్ట్ సిద్ధం చేస్తారట. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమాలు విడుదల అవ్వడం చాలా అరుదు. అందుకే ఇలాంటి సినిమాలు క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి.
Also Read : నింగి నుంచి నేలకు.. 9 నెలల నిరీక్షణ ఫలించిన వేళ.. క్షేమంగా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్..