భర్త రామ్ వీరపనేని కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తున్నాడు. అందుకే సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నిజానికి ఎన్నో ఏళ్ల పాటు సునీత ఒంటరి జీవితాన్ని గడిపింది. ఆ సమయంలో ఆమె చాల ఇబ్బందులు పడింది. ఎన్ని కష్టాలు పడినా సునీత మాత్రం ఎక్కడా నిరుత్సాహపడలేదు.
తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే సునీత సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. నిజానికి తన రెండో భర్తను ఆమె సోషల్ మీడియా కారణంగానే కలిసింది. అయితే తాజాగా సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి ఓ క్యాండిడ్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటో బాగా వైరల్ అవుతుంది.
ఈ ఫొటోలో రామ్ సునీతకు దేని గురించో వివరిస్తూ ఉండగా.. సునీత అందంగా ఆలకిస్తూ ఉంది. అన్నట్టు సునీత త్వరలోనే పాడుతా తీయగా తరహాలో ఒక సరికొత్త ప్రోగ్రాంతో తెలుగు లోగిళ్ళలోకి రాబోతుంది. దీనికి నిర్మాత రామ్ వీరపనేనినే.
ఏది ఏమైనా సునీత గాత్రం ఎంతో కమ్మగా ఉంటుంది. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనాన్ని ఆహ్లాదకరంగా మారుస్తోంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.