
దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతూ వణుకు పుట్టిస్తున్న కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ తాజాగా తమిళాడుకూ పాకింది. ఈ రకం వైరస్ తో తమిళనాడులో తొలి మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ధ్రువీకరించింది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్ స్ట్రెయిన్ తో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్ ఏ సుబ్రమణియన్ వెల్లడించారు.