
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా పేరు ‘బుజ్జీ ఇలా రా’. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా వెనుక ధన్‌రాజ్ పెట్టుబడి ఉందని తెలుస్తోంది. హీరో మెటీరియల్ కాకపోయినా.. ధన్‌రాజ్ ఎప్పటినుండో హీరోగా నిలబడాలని ఆశ పడుతున్నాడు. తాను హీరోగా గతంలో కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు.
అయినా ఆ సినిమాలు ఏవీ ధన్‌రాజ్ కోరికను తీర్చలేకపోయాయి. ధన్‌రాజ్ హీరోగా నిలబడలేకపోయాడు. కనీసం హీరో అని అనిపించుకో లేక పోయాడు. అందుకే ఆస్తులు అమ్మి మరీ ఈ సినిమాకి ధన్‌రాజ్ డబ్బులు పెడుతున్నాడు. తానూ ఒక్కడే హీరో అంటే.. ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి.. సునీల్ ను మరో హీరోగా పెట్టుకున్నారు.
అయితే, హీరోగా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయిన సునీల్ ఇప్పుడు హీరోగా ఎంతవరకు కలెక్షన్స్ రాబడతాడు అనేది పెద్ద డౌట్. పైగా సినిమాటోగ్రాఫర్ గా సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న అంజిని ఈ సినిమాకి దర్శకుడిగా పెట్టుకున్నారు. తాజాగా టైటిల్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. పోస్టర్ ను చూస్తేనే తెలిసిపోతుంది, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో !
ఎందుకంటే.. ఈ సినిమాకి దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి కథ, స్క్కీన్ ప్లే అందిస్తున్నారు. అసలు జి. నాగేశ్వర రెడ్డికి హిట్ వచ్చి చాల కాలం అయిపోయింది. ఆ మాటకొస్తే.. ఆయనకు గతంలో వచ్చిన ఏవరేజ్ హిట్స్ కు స్క్రిప్ట్ ఇచ్చింది కూడా వేరే రైటర్స్. తన సినిమాలకే కథ రాసుకోవడం చేతకాని జి. నాగేశ్వర రెడ్డి, ఇప్పుడు వేరే సినిమాలకు కథలు అందిస్తున్నాడు.
దాంతో ఈ సినిమా పై పెద్ద అనుమానం కలుగుతుంది. మొత్తానికి సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో చాందిని తమిళరసన్ అనే కొత్త భామ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.