Homeఎంటర్టైన్మెంట్Sunil : నటుడు సునీల్ పొలిటికల్ ఎంట్రీ! మేటర్ తెలిస్తే మైండ్ బ్లాక్

Sunil : నటుడు సునీల్ పొలిటికల్ ఎంట్రీ! మేటర్ తెలిస్తే మైండ్ బ్లాక్

Sunil : కమెడియన్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన సునీల్ అనంతరం స్టార్ కమెడియన్ అయ్యాడు. హీరోలకు సమానమైన పాత్రలు ఆయనకు దక్కేవి. అందాల రాముడు మూవీతో పూర్తి స్థాయి హీరో అయ్యాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలు హిట్ కావడంతో సునీల్ హీరోగా సెటిల్ కావడం ఖాయం అనుకున్నారు. ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ తో ఫుల్ ట్రాన్ఫర్మ్ అయ్యాడు. అయితే కామెడీ హీరో నుండి మాస్ హీరోగా ఎదిగే క్రమంలో దెబ్బ పడింది. వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి.

Also Read : మల్టీ స్టారర్ సినిమాలు చేయాలంటే సిద్ధం గా ఉండే ఇద్దరు స్టార్ హీరోలు వాళ్లేనా..?

మల్టీ స్టారర్స్ చేసినా లాభం లేకుండా పోయింది. అటు కమెడియన్ పాత్రలు చేయలేక ఇటు హీరోగా సక్సెస్ లు రాక ఒక దశలో సునీల్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరుకున్నాడు. తెలివిగా అన్ని రకాల పాత్రలు చేస్తూ మరలా బిజీ అయ్యాడు. కలర్ ఫోటో, పుష్ప చిత్రాల్లో సునీల్ విలనిజం చూసి జనాలు ఫిదా అయ్యాడు. దెబ్బకు మరలా సునీల్ దశ తిరిగింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. జైలర్ మూవీలో సునీల్ చేసిన పాత్ర ఆయనకు విపరీతమైన క్రేజ్ రాబట్టింది.

కాగా త్వరలో సునీల్ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తనున్నాడట. అయితే నిజ జీవితంలో కాదు. అది కూడా సినిమాలోనే. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. టీవీకే పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇకపై సినిమాలు చేయను అని శబధం చేసిన విజయ్ చివరి చిత్రంగా జన నాయగన్ మూవీలో నటిస్తున్నారు. తన పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అయ్యేలా ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్నారు.

హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సునీల్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడట. తెల్ల చొక్కా పంచె ధరించి సరికొత్త లుక్ లో ఆయన సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడట. గతంలో సునీల్ ఎన్నడూ పొలిటికల్ లీడర్ రోల్ చేసింది లేదు. జన నాయగన్ లో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది అనే ప్రచారం సాగుతుంది. మరి ఈ నిజమెంతో ప్రముఖంగా వినిపిస్తుంది. అదన్న మేటర్. జన నాయగన్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాబీ డియోల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు.

Exit mobile version