https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘బోగన్’ బొమ్మ అదిరిపోయింది..!

‘జయం’ రవి కోలివుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. రవి చేసే సినిమాలన్నీ అభిమానులను ఆద్యంతం అలరించేలా ఉంటాయి. జయం రవి నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయాలు సాధించాయి. జయం రవి-అరవింద్ స్వామి నటించిన ‘తని ఒరువన్’ మూవీని తెలుగులో ‘ధృవ’గా రీమేకై ఘనవిజయం సాధించింది. తమిళంలో జయం రవి-అరవింద్ స్వామి నటించగా తెలుగులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-అరవింద్ స్వామి నటించారు. Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ ! […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 03:21 PM IST

    bogan trailer

    Follow us on

    ‘జయం’ రవి కోలివుడ్లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. రవి చేసే సినిమాలన్నీ అభిమానులను ఆద్యంతం అలరించేలా ఉంటాయి. జయం రవి నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయాలు సాధించాయి. జయం రవి-అరవింద్ స్వామి నటించిన ‘తని ఒరువన్’ మూవీని తెలుగులో ‘ధృవ’గా రీమేకై ఘనవిజయం సాధించింది. తమిళంలో జయం రవి-అరవింద్ స్వామి నటించగా తెలుగులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-అరవింద్ స్వామి నటించారు.

    Also Read: పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ !

    ఈ నేపథ్యంలో తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘బోగన్’ మూవీని తెలుగులోనూ అదే పేరుతో రిలీజు చేస్తున్నారు. ఇందులో జయం రవి.. హన్సిక మొత్వానీలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరవింద్ స్వామి గత చిత్రాల మాదిరిగానే చాలా స్టైలీష్ గా కన్పిస్తున్నాడు.

    నేడు విడుదలైన ‘బోగన్’ ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు లక్ష్మణ్ మూవీని పూర్తిగా యాక్షన్ ఎంటటైన్మెంట్ గా తీర్చిదిద్దినట్లు కన్పిస్తోంది. బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. జయం రవి-హన్సిక మధ్య రోమాంటిక్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి. అరవింద్ స్వామి-జయం రవి మధ్య వచ్చిన కొన్ని యాక్షన్స్ సీన్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. యాక్షన్ చిత్రాలు ఇష్టపడే అభిమానులకు ఈ చిత్రం మంచి ఎంటట్మెంట్ అందించడం ఖాయంగా కన్పిస్తోంది.

    కొన్ని సీన్లలో అరవింద్ స్వామిని హీరోగా చూపించగా.. కొన్ని సీన్లలో విలన్ గా చూపించారు. విక్రమ్ ఐపీఎస్ గా జయం రవి.. ఆదిత్యగా అరవింద్ స్వామి మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధపడుతున్నారు. ట్రైలర్ మాత్రం హాలీవుడ్ తరహాలో ఉందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాడు.
    Also Read: గల్లీబాయ్స్ తో శ్రీముఖి రచ్చ !

    ‘బోగన్’ మూవీకి డి.ఇమ్మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేశారు. నాజర్.. పొన్ వణ్ణన్.. నరేన్.. అక్షర గౌడ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ట్రైలర్లోనే ప్రకటించింది.

    ట్రైలర్