మొదలైన నాలుగు వారాలకే మంచి క్రేజ్ సంపాదించుకుంది బిగ్ బాస్. ప్రమోషన్స్ లో భాగం డిస్నీ + హాట్ స్టార్ అంబాసిడర్ అయిన రాంచరణ్ బిగ్ బాస్ కి వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా తనతో పాటు మాస్ట్రో టీం ని కూడా బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం చేసాడు రాంచరణ్.
తాజాగా ఇప్పుడు బుల్లి తెరపై దూసుకుపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి వెండితెర నటులు నుండి సపోర్ట్ లభిస్తుంది. ఇంతకీ ఎవరు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే…
ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ పేర్ల మీద ఫ్యాన్ పేజీ ని క్రియేట్ చేసి తమ అభిమానాన్ని తెలుపుతున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ సపోర్ట్ ని తెలియచేస్తారు.
బిగ్ బాస్ లో మిస్టర్ కూలీగా మంచి పేరు తెచ్చుకున్నాడు మానస్. హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఒకేలా ఉంటున్నాడు. ఎక్కడా అనవసరమైన విషయాల జోలికి పోకుండా… ఇటు టాస్క్ పరంగా, అటు బిహేవియర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు మానస్. ప్రతి ఒక్క విషయాన్నీ చాల సెన్సిటివ్ గా డీల్ చేస్తూ సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.
ఇలాంటి జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చేరిపోయాడు. మంచి అభిమానాన్ని సంపాదించుకున్న మానస్ నాగులపల్లి తన ఫేవరెట్ కంటెస్టెంట్ అని, తనకి సపోర్ట్ చెయ్యాలని… కచ్చితంగా మానస్ మనసులు గెలుచుకుని బయటకి వస్తాడు.. అల్ ది బెస్ట్, లవ్ యు అని చెప్పుకొచ్చాడు.
https://www.instagram.com/reel/CUXPEn_J38R/?utm_source=ig_web_copy_link
