spot_img
Homeఎంటర్టైన్మెంట్Niharika Konidela Ata Dance Show Budget: 'ఆట' డ్యాన్స్ షోకి నిర్మాతగా నిహారిక కొణిదెల..ఎంత...

Niharika Konidela Ata Dance Show Budget: ‘ఆట’ డ్యాన్స్ షోకి నిర్మాతగా నిహారిక కొణిదెల..ఎంత బడ్జెట్ పెడుతుందో తెలుసా?

Niharika Konidela Ata Dance Show Budget: మెగా బ్రదర్ నాగబాబు(Nagababu Konidela) కూతురుగా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల(Niharika Konidela), తన కెరీర్ లో సరైన సక్సెస్ ని చూడలేకపోయింది. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఒక్కటి కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వలేదు. దీంతో కొంతకాలం భారీ గ్యాప్ తీసుకున్న నిహారిక, నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఇవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక తర్వాత మళ్లీ గ్యాప్ ఇచ్చి ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సింపుల్ గా విడుదలైన ఈ చిత్రం పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. సినిమాని నిర్మించడానికి అయిన ఖర్చు కేవలం రెండు కోట్లు మాత్రమే.

అలా నిర్మాతగా కెరీర్ లో భారీ సక్సెస్ ని అందుకున్న నిహారిక, ఇప్పుడు జీ తెలుగు ఛానల్ లో, ‘ఆట’ అనే డ్యాన్స్ రియాలిటీ షో తో మన ముందుకు రాబోతుంది. ఈ డ్యాన్స్ షోకి నిర్మాత ఆమెనే. నేటి నుండి ఈ షో ప్రారంభం కానుంది. ప్రతీ శని, ఆదివారాల్లో ఈ షో టెలికాస్ట్ అవ్వనుంది. షో ఫార్మటు విషయం లోకి వస్తే, ఈ షోకి జడ్జీలుగా జానీ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధికా, నిహారిక లు వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఈ రియాలిటీ షోకి హోస్ట్. అయితే ఈ డ్యాన్స్ షోలో మొత్తం మీద 16 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వీరికి మెంటర్స్ గా నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఎవరంటే విష్ణు ప్రియా, కావ్యశ్రీ, వంశీ, సమీరా భరద్వాజ్ వ్యవహరిస్తారు. ఈ నలుగురు మెంటర్స్ కి చెరో 10 లక్షల రూపాయిలు ఇవ్వబడుతుంది.

ఒక్కొక్కరి టీం లో నలుగురు కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ నలుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కచ్చితంగా ఉండాలి. వీళ్ళని మెంటర్స్ తమకు ఇవ్వబడిన పది లక్షల రూపాయలలో ఎంతో కొంత బిడ్ చేసి కొనుక్కోవాలి. ఇది అన్నమాట షో ఫార్మాట్. బాగానే డిజైన్ చేశారు. రాబోయే రోజుల్లో మెంటర్స్ మధ్య గొడవలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ డ్యాన్స్ రియాలిటీ షోకి నిహారిక బాగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 50 లక్షల రూపాయిల వరకు బడ్జెట్ అవ్వొచ్చు. జడ్జీలుగా వ్యవహరిస్తున్న రాధికా శరత్ కుమార్, జానీ మాస్టర్ లకు ఒక్కో ఎపిసోడ్ కి గానూ చెరో 5 లక్షలు , అదే విధంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుధీర్ కి కూడా ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షలు, ఇక మెంటర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో ఎపిసోడ్ 50 వేల నుండి లక్ష రూపాయిలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version