Sundarakanda 5 days Collections: మంచి సినిమాని అందించినప్పుడు ఆడియన్స్ ఆదరించడంలో ఎప్పుడూ విఫలం అవ్వలేదు. ఎంత సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చినా, సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు, థియేటర్స్ కి క్యూలు కడుతారు. కానీ కొంతమంది డైరెక్టర్లు తాము తీసిన సినిమా గొప్ప సినిమా అని ఊహించుకొని, ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు, డబ్బింగ్ సినిమాలను అయితే ఆదరిస్తారు అంటూ ఆడియన్స్ పై నెపం వేయడం చేస్తుంటారు. రీసెంట్ గా ఒక డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇవి. అయితే మంచి సినిమాని నెత్తిన పెట్టుకొని ఆదరిస్తామని ఆడియన్స్ మరోసారి నారా రోహిత్(Nara Rohit) ‘సుందరకాండ'(Sundarakanda Movie) చిత్రం ద్వారా నిరూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అంచనాలు లేకపోవడంతో మొదటి రోజు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి.
బాగున్నా సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ వీకెండ్ లో మళ్లీ వసూళ్లు పుంజుకున్నాయి. మొదటి రోజు వచ్చిన వసూళ్లకంటే ఐదవ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువ అట. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలా పడిన టాలీవుడ్ కి ఈ చిత్రం కాస్త ఊరట కల్పించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు 4 కోట్ల రూపాయలకు జరిగింది. 5 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 50 శాతం రికవరీ అయ్యింది అన్నమాట. సెప్టెంబర్ 5 వరకు మరో సినిమా లేకపోవడం తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సినిమాకు మంచి రిపోర్ట్స్ రావడం తో ఓటీటీ డీల్ కూడా మంచి రేట్ కి అమ్ముడుపోయినట్టు సమాచారం.
నారా రోహిత్ గత చిత్రం ‘భైరవం’ ఆశించిన స్థాయిలో థియేటర్స్ వద్ద ఆడలేదు. కానీ ఆయన పాత్రకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవ్వడం తో ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకున్న నారా రోహిత్ , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. పెళ్ళికి ముందు ఆయనకు సుందరకాండ రూపం లో మంచి బహుమతి దొరికిందని చెప్పొచ్చు. వచ్చే వారం విడుదలయ్యే సినిమాలు సూపర్ హిట్ అయితే ‘సుందరకాండ’ పై కాస్త ప్రభావం పడొచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం ఆడియన్స్ కి మళ్లీ ఈ చిత్రమే మొదటి ఛాయస్ అవుతుంది.