Peddi Movie Stopped: రామ్ చరణ్(Global Star Ram Charan) ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు ‘పెద్ది'(Peddi Movie) చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ‘రంగస్థలం’ తర్వాత #RRR మినహా, రామ్ చరణ్ చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. వినయ విధేయ రామ, ఆచార్య, గేమ్ చేంజర్ వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. స్టార్ హీరోలలో ఈమధ్య కాలం లో ఇన్ని వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్న హీరోలు ఎవ్వరూ లేరు. ప్రభాస్ కి వరుసగా ఆది పురుష్, సాహూ, రాధే శ్యామ్ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ పడ్డాయి, పవన్ కళ్యాణ్ కి ఈమధ్య కాలం లో హరి హర వీరమల్లు అనే డిజాస్టర్ పడింది కానీ, వాళ్ళు మళ్లీ ఓజీ, సలార్, కల్కి చిత్రాలతో కం బ్యాక్ ఇచ్చారు. కానీ రామ్ చరణ్ నుండి మాత్రం ఇంకా కం బ్యాక్ రాలేదు. అన్ని విధాలుగా చూసుకుంటే ‘పెద్ది’ చిత్రం చరణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
దానికి తోడు రీసెంట్ గా విడుదలైన పెద్ది గ్లింప్స్, రెండు మూడు రోజుల క్రితం విడుదలైన ‘చికిరి చికిరి’ పాట కూడా పెద్ద హిట్ అయ్యి సినిమా పై అంచనాలు పెంచేసాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. అన్ని ప్లాన్ ప్రకారం వెళ్తే ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. కానీ అభిమానులకు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త విన్న తర్వాత ఆనంద పడాలో, బాధ పడాలో అర్థం అవ్వని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే రామ్ చరణ్ సతీమణి త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతోంది.
డెలివరీ డేట్ కూడా రావడం తో ఆమె బాగోగులు చూసుకోవడానికి రామ్ చరణ్ పక్కనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతకాలం వరకు పెద్ది మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నాడట. అంటే డెలివరీ అయ్యే వరకు రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశమే లేదు. దీనిని బట్టీ చూస్తే పెద్ది చిత్రం మార్చి 27 న విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. పెద్ది ఒకవేళ ఆ తేదీన రాకపోతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ వార్త ని ఎలా తీసుకుంటారో చూడాలి. మార్చ్ నెల దాటితే పెద్ది కి మరో మంచి డేట్ వచ్చే అవకాశం లేదు, చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.