https://oktelugu.com/

Sumanth: ANR అసలు సిసలు మనవడ్ని నేనే.. వాళ్ళు కాదు : సుమంత్

లెజెండ్ కి వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా, తన జెనెరేషన్ లో టాప్ 3 హీరోలలో ఒకడిగా నిలిచాడు. కానీ ఆయన కొడుకులు మాత్రం ఆయన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయారు, ఇక అక్కినేని నాగేశ్వర రావు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమంత్

Written By:
  • Vicky
  • , Updated On : June 12, 2023 / 05:56 PM IST

    Sumanth

    Follow us on

    Sumanth: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి మహానుబావుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు. టాలీవుడ్ కి నటన నేర్పిన వారిలో ఆయన కూడా ఒకరు, ఎన్నో హిట్లు , సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకున్న ఆయన తెలుగు సినీ పరిశ్రమ కి చేసిన సేవలను ఎప్పటికీ మరచిపోలేము. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఒక నటుడిగా ఆయన ఈ భూలోక సజీవంగా ఉన్నన్ని రోజులు మనతోనే ఉంటాడు.

    అలాంటి లెజెండ్ కి వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా, తన జెనెరేషన్ లో టాప్ 3 హీరోలలో ఒకడిగా నిలిచాడు. కానీ ఆయన కొడుకులు మాత్రం ఆయన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయారు, ఇక అక్కినేని నాగేశ్వర రావు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమంత్ , కెరీర్ ప్రారంభం లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసినా ఆ తర్వాత దానిని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగించడం లో ఫెయిల్ అయ్యాడు.

    ఇప్పుడు ఆయన అడపాదడపా పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తూ కెరీర్ ని సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ లో వరుసగా ఈమధ్య బియోపిక్స్ వస్తున్నాయి,MS ధోని , సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ , మహానటి సావిత్రి , ఎన్టీఆర్ ఇలా ఎందరో మహానుభావుల బియోపిక్స్ వచ్చాయి. కానీ అక్కినేని నాగేశ్వర రావు గారి బయోపిక్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు.

    మీ కుటుంబం లో ఎవరైనా ఆయన బయోపిక్ ని నిమరించాలనుకుంటే, నాగేశ్వర రావు పాత్రకి ఎవరు కరెక్ట్ గా సూట్ అవుతారు అని అడగగా దానికి సుమంత్ సమాధానం ఇస్తూ ‘తాత గారి పాత్రకి నేను మాత్రమే న్యాయం చెయ్యగలను, మా కుటుంబం లో ఇంకెవ్వరి వల్ల అది సాధ్యం కాదు, ఆయన పోలికలు నాకు మాత్రమే వచ్చాయి’ అంటూ కామెంట్ చేసాడు.ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.