https://oktelugu.com/

Hero Sumanth: చెక్​బౌన్స్​ కేసులో కోర్టు మెట్లెక్కిన హీరో సుమంత్​

Hero Sumanth: ప్రముఖ టాలీవుడ్​ హీరో సుమత్​, నిర్మాత సుప్రియ కోర్టుమెట్లు ఎక్కారు. ఓ చెక్​ బౌన్స్ కేసులో వీరిద్దరూ మార్కాపురం కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. గతంలో సుమంత్​ హీరోగా బాలీవుడ్​ సినిమా అయిన విక్కీ డోనార్​ను తెలుగులో నరుడా.. డోనరుజా పేరుతో రీమేక్​గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్యూడియోస్​ బ్యానర్​పై ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు మార్కాపురంకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫైనాన్స్ అందించారు. అయితే, నిర్మాతలు తనకిచ్చిన చెక్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 01:16 PM IST
    Follow us on

    Hero Sumanth: ప్రముఖ టాలీవుడ్​ హీరో సుమత్​, నిర్మాత సుప్రియ కోర్టుమెట్లు ఎక్కారు. ఓ చెక్​ బౌన్స్ కేసులో వీరిద్దరూ మార్కాపురం కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. గతంలో సుమంత్​ హీరోగా బాలీవుడ్​ సినిమా అయిన విక్కీ డోనార్​ను తెలుగులో నరుడా.. డోనరుజా పేరుతో రీమేక్​గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్యూడియోస్​ బ్యానర్​పై ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు మార్కాపురంకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫైనాన్స్ అందించారు. అయితే, నిర్మాతలు తనకిచ్చిన చెక్​ బౌన్స్​ అయ్యిందని కోర్టులో శ్రీనివాసరావు కేసు వేశారు. అప్పటి నుంచి వాయిదాల మీద ఈ కేసు నడుస్తూనే ఉంది. కరోనా వల్ల మధ్యలో కాస్త గ్యాప్​ వచ్చి.. ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది.

    Hero Sumanth

    Also Read: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

    తాజాగా, మరోసారి ఈ కేసు వాయిదాకు రావడం వల్ల.. హీరో సుమంత్​, నిర్మాత సుప్రియ మార్కాపురం కోర్టుకు వచ్చారు. అయితే, తీర్పు వెలువడిందా.. లేక మళ్లీ వాయిదా పడిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే సుమంత్​ హీరో కావడంతో అక్కడి ప్రజలు అతనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

    కాగా, ప్రస్తుతం మళ్లీ మొదలైంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ హీరో.. గతంలో వచ్చిన మళ్లీ రావా సినిమా హిట్ కావడంతో అప్పటి నుంచి కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తలు వహిస్తున్నాడు సుమంత్​. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ఈ సినమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Also Read: తిరుమల వెంకన్నను దర్శించుకున్న అఖండ మూవీ యూనిట్…