Allu Arjun: బన్నీ నటన మాస్ కి ఉత్తేజాన్ని కలిగిస్తోంది, బన్నీ డ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది. తన సినిమాల విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటాడో.. బయట అంత కూల్ గా సరదాగా కనిపిస్తాడు. పెద్ద కుటుంబంలో పుట్టినా.. కష్టపడే స్వభావంతోనే బన్నీ ప్రయాణం మొదలైంది. అందుకే, నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ. ఆ మాటకొస్తే తెలుగు నేల పైన అంతటి విభిన్నమైన హీరో మరొకరు లేరు.
నలుగురు హీరోలు వెళ్తున్న బాట బన్నీకు నచ్చదు. అందుకే, తనదైన పంథాను సృష్టించుకున్నాడు. బన్నీ పాత్రలు పచ్చిగా ఉంటాయి, డొంక తిరుగుడు ఉండదు, ముక్కుసూటిగా మాట్లాడటం బన్నీ నైజం. ఆ విలక్షణమే అల్లు అర్జున్ ను తెలుగునాట ఐకాన్ స్టార్ ను చేసింది. ఆయనను తెలుగు ప్రేక్షకులు ‘బన్నీ’ అంటూ ఆరాధిస్తున్నారు అంటే కారణం..
అల్లు అర్జున్ రీల్ హీరో అని కాదు, కష్టంతో ఎదిగిన రియల్ హీరో అని. ఇక బన్నీ సినిమాల్లో ఉండే మరో ప్రత్యేకత.. మెసేజ్‌లు ఇచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయడు. సగటు మనిషి ఆలోచనల్లోని ఒడిదుడుకులను పట్టుకుంటాడు. అలాగే మాస్ తో నిండిపోయిన ఎమోషన్స్, వాటి పై ఒక హీరోలా ఎలివేట్ అవుతాడు. అయితే, ఈ క్రమంలో ఓవర్ మాస్ నెసే ఎక్కువ ఉంటుంది.
Also Read: Pushpa: పుష్ప టీమ్‌కు ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పెషల్ విషెస్.. తగ్గేదెలే అంటూ ట్వీట్
దాంతో బన్నీ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా బన్నీ క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నేడు రిలీజ్ అయిన పుష్పకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘తగ్గేదే లే’ అంటూ బన్నీ తన క్యారెక్టరైజేషన్ తో బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన ఫ్యాన్స్ ను పుష్ప సినిమా బాగా మెప్పిస్తుంది. దాంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.
Also Read: Pushpa Telugu Movie Review: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ