Bigg Boss 9 Telugu new captains: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో మంచి ఊపు మీద కొనసాగుతుంది. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో కూడా గత సీజన్ తో పోలిస్తే చాలా బెస్ట్ అని అంటున్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత కాస్త టీఆర్ఫీ రేటింగ్స్ పై గట్టి ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత అరుపులు, గొడవలు తప్ప ఆడియన్స్ కి సరైన మంచి కంటెంట్ రావడం లేదు. ఈరోజు నాగార్జున కంటెస్టెంట్స్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి షో ని గాడిలో పెట్టకపోతే, ఈ సీజన్ కూడా యావరేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా ఈ వారం హౌస్ కి ఇద్దరు కెప్టెన్స్ వచ్చారు. ఒకరు సుమన్ శెట్టి కాగా, మరొకరు గౌరవ్ గుప్తా. నిన్న వీళ్లిద్దరు టాస్కులు ఎలా ఆడి గెలిచారో మనమంతా చూసాము.
కెప్టెన్ అయ్యాక సుమన్ శెట్టి ఆనందం చూసి సోషల్ మీడియా లో ఆయనపై ఎన్నో వేల మీమ్స్ వచ్చాయి. కొన్ని ఫన్నీ మీమ్స్ ని చూస్తే నవ్వు రాక తప్పదు. గౌరవ్ కి తెలుగు రాదు. హౌస్ మేట్స్ కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయనకు చెప్పుకోడానికి వెళ్తే వాళ్లకు నరకం కనిపిస్తాది. ఇక సుమన్ శెట్టి విషయానికి వస్తే ఈయనకు తెలుగు తప్ప ఏమి రాదు. కెప్టెన్ అన్న తర్వాత కమాండింగ్ గా ఉండాలి. అలా కమాండ్ చేయడం సుమన్ శెట్టి వల్ల కాదు అని నిన్న ఒక లైవ్ ఉదాహరణ దొరికింది. రమ్య కోసం వచ్చిన ఐస్ క్రీం ని తనూజ,దివ్య మరియు రీతూ చౌదరి ఫ్రిడ్జ్ నుండి దొంగచాటుగా సుమన్ శెట్టి ముందే తీసుకొని తింటున్నారు. కానీ సుమన్ వాళ్ళని చూసి కూడా ఏమి అనలేదు. ఇంత చిన్న విషయం లోనే కెప్టెన్ గా ఆయన ఒక స్టాండ్ తీసుకోకపోతే, ఇక హౌస్ మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేయగలడు?.
ఇక గౌరవ్ విషయానికి వస్తే, ఇతనికి హౌస్ ని నడిపే సత్తా ఉంది, కానీ భాష అర్థం అవ్వదు. ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటాడు. వీళ్లిద్దరు సమన్వయంతో వచ్చే వారం హౌస్ ని ఎలా నడుపుతారో చూడాలి. గత వారం హౌస్ కి కెప్టెన్ గా వ్యవహరించిన కళ్యాణ్, అద్భుతంగా తన బాధ్యతలను చేపట్టాడు అనే చెప్పాలి. ఒక పక్క మాధురి డామినేషన్ చూపిస్తూ అందరి పై అరవడం, ఇంకో పక్క అయేషా సంబంధం లేకుండా గొడవలు పడడం, వీళ్ళతో పాటు పాత కంటెస్టెంట్స్ ని మ్యానేజ్ చేస్తూ చాలా చక్కగా, కూల్ యాటిట్యూడ్ తో హౌస్ ని నడిపించాడు. అలా నడపడం ప్రస్తుతం ఉన్న ఇద్దరి కెప్టెన్స్ కి అసాధ్యం అనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీళ్ళు తమలోని కొత్త యాంగిల్స్ ని చూపిస్తూ, హౌస్ ని బాగా నడిపి ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తారేమో చూద్దాం.