Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి రౌండ్ లో ‘ఫ్లోట్ ఆర్ సింక్’ అంటూ టాస్క్ ఇచ్చారు.కెప్టెన్సీ రేస్ లో భాగంగా రెండో రౌండ్ లో ‘డబ్బాలు సెట్ చేయాలి అంతే’ అంటూ మరో టాస్క్ నిర్వహించాడు. ఇందులో కంటెస్టెంట్స్ కలర్ బాక్స్ లు వరుస క్రమంలో సెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎరేంజ్ చేసే క్రమంలో డబ్బాలు పైకి లేపకూడదు అని కండిషన్ పెట్టాడు బిగ్ బాస్.
ఆట ఆడేందుకు ప్రశాంత్,యావర్,గౌతమ్,రతిక రంగంలోకి దిగారు. ఈ టాస్క్ చాలా ఉత్కంఠగా సాగింది. అయితే ప్రశాంత్ అందరికంటే ముందు టాస్క్ ఫినిష్ చేసి గంట మోగించాడు. టాస్క్ విన్ అయ్యాడు. యావర్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక బజర్ మోగడంతో ఆట పూర్తయింది. కానీ ఇప్పుడే మొదలైంది అసలైన రచ్చ. శోభా,తేజ తో ఒక మాటంది. నేను ఓడిపోయాను అని పర్సనల్ గా ఫీల్ అయ్యావు కాబట్టి అన్నావు అని చెప్పింది శోభా.
దాంతో నేను అసలు ఆ మాట అన్నానా అని అన్నాడు తేజ.నేను విన్నాను తేజ అంటూ శోభా ఆరోపించింది. దాంతో తేజ కోపంతో ‘నువ్వేంటి ప్రతి దానికి అరుస్తావ్ ‘అంటూ ఫైర్ అయ్యాడు. శోభా ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. కానీ తేజ ‘నువ్వు అసలు అవతలికి పోవమ్మా అంటూ శోభా పై ఎగిరి పడ్డాడు. నాకు అసలు అవసరం లేదు అంటూ వెళ్లిపోయాడు తేజ.
దీనికి శోభా నువ్వు భయపడి వెళ్ళిపోతున్నావ్,ఒక మనిషి ఏడ్చారంటే దానికి వాల్యూ ఉంటుంది అని అంది. చిన్న విషయాన్ని పెద్దది చెయ్యొద్దు అని తేజ అరిచాడు.కానీ శోభా మాత్రం తగ్గలేదు ఎందుకు వెళ్ళిపోతున్నావ్ రా అంటూ గోల చేసింది. దాంతో తేజ నేను ఇక్కడే ఉన్నా కదా చెప్పించు అని చెప్పాడు. తర్వాత శివాజీ తో’ ఏంటన్న ప్రతిదానికి ఇది .. నేనేదో రతిక తో సరదాగా అంటే దానికి దీనికి లింక్ పెడుతుంది’ అంటూ బీపీ వచ్చినట్లు రంకెలేశాడు తేజ. ఏదైనా ఎక్కువైతే అంతే వదిలేయ్ అని శివాజీ తేజ కి నచ్చజెప్పాడు.