యాంకర్ సుమ బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది. ఎన్నో ఏళ్లుగా యాంకర్ చేస్తున్న యాంకర్ సుమకు ఎనలేని క్రేజీ ఉంది. టాలీవుడ్లో కొంతమంది హీరోహీరోయిన్ల క్రేజ్ కంటే సుమ క్రేజ్ ఎక్కువ. బుల్లితెర ప్రేక్షకులతోపాటు సినిమా ప్రేక్షకులను ఆమె సుపరిచితమే. స్టార్స్ ఆడియో ఫంక్షన్ సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు.. అయితే సుమపై వస్తున్న కొన్ని రూమర్స్ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?
యాంకర్ సుమ తనపై వచ్చే రూమర్స్ ఎప్పుడూ పెద్దగా స్పందించిన దాఖలాల్లేవు. ఒకరి అర సంఘటనలు మినహా ఆమె కెరీర్లో రూమర్స్ పై స్పందించలేదు. ఎప్పుడు తన షూటింగులతో బీజీగా ఉండే సుమపై ఇటీవల ఒక గాసిప్స్ ఇబ్బంది పడుతోంది. సుమ తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తొలుత పెద్దగా స్పందించని సుమ ఈ రూమర్స్ రోజురోజుకు పెరుగుతుండటంతో తనదైన శైలిలో స్పందించింది.
సుమ, రాజీవ్ కనకాల వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు. షూటింగులతో ఎంత బీజీగా ఉన్న ఆమె ఫ్యామిలీకి కొంత సమయాన్ని కేటాయిస్తూనే ఉంటోంది. అయితే ఇటీవల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో విడిపోయాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ఈ తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా సుమ తన ట్వీటర్లో ఇటీవల ఓ పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫొటోకు ‘నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం.. నువ్వే నా ఆనందం..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా తాము విడిపోతున్నామని వస్తున్న వార్తలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.