Hari : బుల్లితెర కామెడీ షోల ద్వారా ఊహించని స్థాయిలో ఫేమస్ అయిన వాళ్లలో ఎక్స్ ప్రెస్ హరి కూడా ఒకరనే సంగతి తెలిసిందే. గతంలో ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి కలిసి స్కిట్స్ చేయగా వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అషురెడ్డి పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని ఒక కామెడీ షోలో ఎక్స్ ప్రెస్ హరి హల్చల్ చేయడంతో అతని పేరు వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా ఎక్స్ ప్రెస్ హరి స్టార్ మా పరివార్ లీగ్3 ప్రోగ్రామ్ కు వచ్చారు.
ఈ ప్రోగ్రామ్ కు ఝాన్సీ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా దేవత, పాపే మా జీవనజ్యోతి సీరియళ్ల నటీనటులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని సందడి చేశారు. ఎక్స్ ప్రెస్ హరి “అభిమాని లేనిదే హీరోలు లేరులే” సాంగ్ తో ఎంట్రీ ఇవ్వగా ఝాన్సీ ఎవరు బాబు నువ్వు రిబ్బన్ పట్టుకుని వచ్చేశావ్ అంటూ ఎక్స్ ప్రెస్ హరి పరువు తీసేశారు. దేవత సీరియల్ యాక్టర్ అర్జున్ మా సీరియల్ ఏ టైమ్ కు వస్తుందో చెప్పు అని ఎక్స్ ప్రెస్ హరిని అడగగా హరి ఆ ప్రశ్నకు జవాబు చెప్పడంలో ఫెయిలవుతాడు.
దేవత సీరియల్ వాళ్ల కోసం గుండెపై దేవత అని పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెబుతాడు. యాక్టర్ అర్జున్ ఆ పచ్చబొట్టును చేతితో చెరిపేయగా ఆ పచ్చబొట్టు చెరిగిపోతుంది. అషురెడ్డి విషయంలో కూడా అప్పట్లో అలా పచ్చబొట్టు వేసుకున్నట్టు చూపిస్తూ ఎక్స్ ప్రెస్ హరి పరువు తీసేశారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.
ఈ షో ప్రసారమయ్యే సమయంలో ఈటీవీ ఛానల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రసారమవుతూ ఉండటంతో ఆ ఎఫెక్ట్ కొంతమేర ఈ షోపై పడుతుందని తెలుస్తోంది. ఈ షోలో ఎక్స్ ప్రెస్ హరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.