Suma Adda- Rana Daggubati: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే విలక్షణ నటుడు అని పేరు తెచ్చుకున్న నేటి తరం యంగ్ హీరో దగ్గుపాటి రానా. ‘లీడర్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ‘బాహుబలి’ చిత్రానికి ముందే బాలీవుడ్ లో సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగాడు. ఇక బాహుబలి సిరీస్ లో విలన్ గా నటించి పాన్ వరల్డ్ రేంజ్ లో అందరికీ పరిచయం అయ్యాడు. ఈ సిరీస్ తర్వాత రానా కెరీర్ వేరే లెవెల్ కి వెళ్తుందని అందరూ ఊహించారు కానీ, ఆరోగ్య సమస్యల కారణం గా అతి తక్కువ సినిమాలే చేస్తూ, ఎక్కడ ప్రారంభం అయ్యాడో అక్కడే ఉండిపోయాడు.
అయితే రీసెంట్ గా రానాకి ‘భీమ్లా నాయక్’ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పోటీగా నువ్వా నేనా అనే రేంజ్ లో ఆయన నటించాడు. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ ఉండడం వల్ల విమర్శకుల నుండి నెగటివ్ కామెంట్స్ తీవ్రంగా వచ్చాయి కానీ చివరికి సూపర్ హిట్ గానే నిల్చింది.
త్వరలోనే సీజన్ 2 షూటింగ్ కూడా ప్రారంభం అవ్వబోతుందట, ఇది కాసేపు పక్కన పెడితే రానా కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన నిర్మాతగా వ్యవహరించిన పరేషాన్ అనే చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన, ఈటీవీ లో ప్రసారమయ్యే సుమా అడ్డా అనే కార్యక్రమానికి విచ్చేశాడు.ఈ ప్రోగ్రాం లో ఆయన సుమతో కాసేపు సరదాగా చేసిన చిట్ చాట్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో తెగ ట్రెండింగ్ అవుతుంది.
ఇందులో సుమ ఒక ప్రశ్న అడుగుతూ మీలో ‘పిలవగానే పార్టీ కి వెళ్లిపోయే వాళ్ళు ఎవరు’ అని అడగగా, రానా దానికి సమాధానం ఇస్తూ ‘పిలవగానే పార్టీలకు వెళ్లిపోయే వాళ్లలో నేను ముందు ఉంటాను, ఆ విషయం లో మా బ్యాచ్ కి నేనే హెడ్ ని. మందు అంటే అంత ఇష్టం నాకు’ అంటూ రానా సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది.