Samantha Mother Role: క్రేజీ హీరోయిన్ కి తల్లిగా నటించబోతున్న సమంత.. పాపం ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

గత ఏడాది ఆమె 'ఫ్యామిలీ మ్యాన్ ' సీజన్ 2 వెబ్ సిరీస్ లో మెయిన్ విలన్ గా నటించి ఇంతమంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈమె అదే 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ని తీసిన రాజ్ & డీకే తో కలిసి 'సిటాడెల్' అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది.

Written By: Vicky, Updated On : June 2, 2023 11:53 am

Samantha Mother Role

Follow us on

Samantha Mother Role: ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో విలక్షణమైన నటనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఎలాంటి పాత్రని అయినా పోషించడానికి సిద్ధంగా ఉండే హీరోయిన్స్ లో ఒకరు ఆమె. హీరోయిన్ గా సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్నవాళ్లు విలన్ రోల్స్ చెయ్యడానికి చాలా భయపడుతుంటారు. కానీ సమంత విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఏ మాత్రం వెనుకాడడు.

గత ఏడాది ఆమె ‘ఫ్యామిలీ మ్యాన్ ‘ సీజన్ 2 వెబ్ సిరీస్ లో మెయిన్ విలన్ గా నటించి ఇంతమంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈమె అదే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ని తీసిన రాజ్ & డీకే తో కలిసి ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది.

అయితే ఈ చిత్రం హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి రీమేక్ అంటూ ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. ఈ వెబ్ సిరీస్ రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ ని ప్రారంభించుకుంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సమంత మరియు వరుణ్ ధావన్ చేస్తున్న ‘సిటాడెల్’ చిత్రం హాలీవుడ్ ‘సిటాడెల్’ కి రీమేక్ కాదని, ఇది ఆ చిత్రానికి ప్రీక్వెల్ అని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అవుతుంది.

హాలీవుడ్ వెర్షన్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా తల్లితండ్రులు కూడా ఒక రా ఏజెంట్స్ గా చెప్తారు, బ్యాక్ స్టోరీ ఏమి చిత్రీకరించలేదు, ఎందుకంటే ప్రీక్వెల్ రాబోతుంది కాబట్టి. అంటే ప్రియాంక చోప్రా తల్లి తండ్రులుగా సమంత మరియు వరుణ్ ధావన్ నటించబోతున్నారు అన్నమాట. మరి ఆడియన్స్ దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.