kondapolam: ‘కొండపొలం’ తీయాలనుకున్న సుకుమార్​.. కానీ!

kondapolam: ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్​ తేజ్​ హీరోగా తెరకెక్కిన చిత్రం కొండ పొలం. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్​ తో … మంచి కలెక్షన్లను సంపాదిస్తుంది. కొండపొలం నవల అధారంగా క్రిష్ ఈ సినిమా రూపొందించారు. రకుల్​ ప్రీత్​ సింగ్​ హీరోయిన్​గా అలరించింది.ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే, ఈ సినిమాను క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ తీయాలని భావించినట్లు సమాచారం. తీరిక దొరికితే పుస్తకాల్లో మునిగిపోయే […]

Written By: Raghava Rao Gara, Updated On : October 11, 2021 12:57 pm
Follow us on

kondapolam: ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్​ తేజ్​ హీరోగా తెరకెక్కిన చిత్రం కొండ పొలం. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్​ తో … మంచి కలెక్షన్లను సంపాదిస్తుంది. కొండపొలం నవల అధారంగా క్రిష్ ఈ సినిమా రూపొందించారు. రకుల్​ ప్రీత్​ సింగ్​ హీరోయిన్​గా అలరించింది.ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే, ఈ సినిమాను క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ తీయాలని భావించినట్లు సమాచారం.

తీరిక దొరికితే పుస్తకాల్లో మునిగిపోయే సుకుమార్​.. కొండపొలం నవల నచ్చడంతో ఈ కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని అనుకున్నాడట. అప్పటికే పుష్ప మూవీ స్క్రిప్ట్​ సిద్ధం చేసుకోవడం వల్ల కొండపొలం పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ‘పుష్ప’ మూవీ కూడా ఆటవి నేపథ్యంలో ఉండటంతో రెండు సినిమాలు ఒకే నేపథ్యంలో వస్తాయని భావించి కొండపొలం తీయాలన్న ఆలోచనను పక్కన పెట్టాడట సుకుమార్‌.

మరోవైపు, ఈ సినిమా తీయడానికి సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌ కారణమని క్రిష్​ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుకుమార్‌ ఓ సందర్భంగా కొండపొలం నవలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు క్రిష్‌ తెలిపారు. క్రియోటివ్‌గా ఆలోచిస్తూ కథతో ప్రయోగాలు చేసే సుక్కు కొండపొలం తీస్తే ఏలా ఉండేదో అని, థ్రిల్​ ని మిస్​ అయ్యామని నెటిజన్లు కామెంట్స్​ చేస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పుష్పను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్​ హీరోగా నటిస్తుండగా, రష్మిక హీరోయన్​గా కనిపించనుంది.