https://oktelugu.com/

India chaina: చైనాను ఎదుర్కోవడానికి భారత్ శక్తి సరిపోతుందా? ఎంతుంది?

India chaina: చైనాతో ఉద్రికత్తల నేపథ్యంలో మరోసారి భారత్ చర్చలు ‘మామ’ అన్నట్టుగానే సాగాయి. ఓవైపు భారత్ లోకి దూసుకువస్తూనే మరో వైపు చర్చల పేరిట కాలయాపన చేస్తోంది కుటిల డ్రాగన్ దేశం.  భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న చైనాతో ముప్పు ఉందని గత రెండు సంవత్సరాలుగా ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పాలకులు మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కారిస్తామని అంటున్నారు. కానీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. అక్రమంగా భూభాగంలోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2021 / 01:02 PM IST
    Follow us on

    India chaina: చైనాతో ఉద్రికత్తల నేపథ్యంలో మరోసారి భారత్ చర్చలు ‘మామ’ అన్నట్టుగానే సాగాయి. ఓవైపు భారత్ లోకి దూసుకువస్తూనే మరో వైపు చర్చల పేరిట కాలయాపన చేస్తోంది కుటిల డ్రాగన్ దేశం.  భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న చైనాతో ముప్పు ఉందని గత రెండు సంవత్సరాలుగా ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పాలకులు మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కారిస్తామని అంటున్నారు. కానీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. అక్రమంగా భూభాగంలోకి చొరబడుతూ తన బుద్ధిని చూపిస్తోంది. గతంలో గాల్వాన్ లో జరిగిన సంఘటనతో యుద్ధవాతావరణం నెలకొనగా.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే భారత్ ధీటైన సమాధానం ఇవ్వడంతో చైనా వెనకడుగు వేసింది. కానీ అప్పుడప్పుడూ దుష్ట చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా తో యుద్ధం వస్తే సిద్ధంగా ఉండాలన్న విధంగా భారత్ రక్షణ శాఖ అన్ని విధాల సిద్ధమవుతోంది. త్రివిధ దళాలు తమ శక్తి యుక్తులను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నాయి.

    ఇందులో భాగంగా ఈనెల 8న భారత వైమానిక దళం 89వ ఫౌండేషన్ డే జరుపుకుంది. ఇందులో భాగంగా వాయుసేన యుద్ధ విమానాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ప్రసంగిస్తూ మనం ఎదుర్కొంటున్న భద్రతా సిబ్బందిని చూసినప్పుడు, కీలక సమయాల్లో నేను బాధ్యతలు స్వీకరించానని అనుకుంటున్నానని అన్నారు. బయటి దేశాల శక్తుల ఉల్లంఘనను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని అంటున్నారు. పాతబడిన యుద్ధ విమానాలను దశల వారీగా పేజవుట్ కూడా చేస్తుంటామని, అందుకే మొత్తం స్కాడ్రన్ల సంఖ్య మరో దశాబ్దం పాటు 35 గానే ఉంటుందని అన్నారు.

    ఒక వైపు భారత్ తన దళ సామర్థ్యాన్ని పెంచుకుంటుూ ఉంటే అటు చైనా సైతం రెట్టింపు యుద్ధ విమానాలను రెడీ చేసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఒకవేళ యుద్ధం ఏర్పడితే భారత్ ఎదుర్కొనే సామర్థ్యం ఉందా..? అనే చర్చ సాగుతోంది. ఒకవేళ భారత్ కు దళాలు సరిపోకపోతే ఇతర దేశాల నుంచి సాయం తీసుకోవచ్చు. క్వాడ్ లాంటి గ్రూపులు ఎలాంటి కష్ట సమయాల్లోనైనా భారత్ కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని భారత కమోడోర్ దీక్షిత్ అంటున్నారు. అయితే భారత్ వద్ద కూడా అత్యాధునిక విమానాలున్నాయని మార్షల్ బార్బోరా అన్నారు. మిరాజ్ 2000, మిగ్-29విమానాలను అప్ గ్రేడ్ చేశామని, 250కి పైగా సుఖోయ్ విమానాల ఫ్లైట్ ఉందని అన్నారు. రఫేల్ విమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.

    కొన్నేళ్లుగా విమానాలు, వాటి విడిభాగాల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఖరీదైన యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం అసాధ్యంగా మారిపోతుంది. అయితే ఈ కొనుగోళ్లపై వివాదాలు కూడా ఏర్పడుతున్నాయి. విమానాల కొనుగోలు మాములు విషయం కాదని, మొదటి విడత రఫేల్ విమానాలు భారత్ కు చేరుకోవడానికి నాలుగేళ్లు పట్టిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ పీకే బ్బోరా అన్నారు. . ఒప్పందం కుదుర్చుకున్న తరువాత మన దేశానికి రావడానికి కనీసం ఆరేళ్లు పట్టవచ్చని తెలిపారు. విమానాల తయారీ సంస్థ ఉత్పత్తి వేగం పెంచడం లేదు. 114 యుద్ధ విమానాల కోసం సంతకాలు పెట్టడంతో చివరి విమానం వచ్చే సరికి ఆలస్యమవుతుందని అంటున్నారు.

    అయితే విమానాల లోటును భర్తీ చేయడానికి భారత వైమానిక దళం 114 మిలిటరీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. 2019లో ఏప్రిల్ లో సుమారు 18 బిలియన్ డాలర్ల వ్యయంతో 114 ఫ్లైట్లను కొనుగోలు చేయడానికి టెండర్ వేసింది. 83 తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాప్ట్ కొనుగోళ్ల వల్ల తమ యుద్ధ సామర్థ్యం లోటు ఉండదని వైమానిక దళానికి చెందిన నిపుణులు అంటున్నారు.