Pushpa 2
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో వంద మిలియన్ కి పైగా వ్యూస్ ని దక్కించుకున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ కారణంగా సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తప్పుకోవడం అభిమానులను కాస్త నిరాశకి గురి చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన రెండు అద్భుతమైన పాటలు ఇండియా వైడ్ గా ఎలా హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కానీ సుకుమార్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు. ఆడియన్స్ ఇప్పటి వరకు అనుభూతి చెందని సౌండింగ్ ని ఆయన కోరుకున్నాడు. కానీ దేవి శ్రీ ప్రసాద్ నుండి అలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాలేదు. ఎన్ని ట్రాక్స్ కంపోజ్ చేసి ఇచ్చినా సుకుమార్ కి నచ్చడం లేదు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ని సినిమా నుండి తప్పించి, కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ని పెట్టుకున్నాడు సుకుమార్. 15 రోజుల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం పూర్తి చేయాలనీ ఆయనకీ చెప్పారట. కానీ అంత తొందరగా అసలు కుదరదు సార్, నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడట. ఇటీవలే ఆయన ఫస్ట్ హాఫ్ మొత్తానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని పూర్తి చేసాడట. రీసెంట్ గానే దీని రషస్ చూసిన సుకుమార్, పెద్దగా సంతృప్తి చెందలేదని సమాచారం.
కొన్ని కీలకమైన సన్నివేశాలకు మరోసారి రీ వర్క్ చేయాలసిందిగా కోరాడట. సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం ఉంది. ఇక్కడ రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులు పూర్తి కాలేదు. మరోపక్క హైదరాబాద్ లో ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఒక సాంగ్ షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉందట. చూస్తూ ఉంటే సినిమా విడుదలకు ముందు రోజు వరకు కూడా షూటింగ్ చేస్తూనే ఉండేట్టు ఉన్నారు. ఇలా అయితే ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. పుష్ప పార్ట్ 1 అప్పుడు కూడా ఇంతే, చివరి నిమిషం వరకు పని చేస్తూనే ఉన్నాడు సుకుమార్. ఆయన ప్రతీ సినిమాకి ఇంతే, ఈ పాటికి నేషనల్ లెవెల్ లో ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ ఇంకా షూటింగ్ లో బిజీ గా గడపడంని చూస్తుంటే అభినుల్లో కొత్త కొత్త టెన్సన్స్ పుట్టుకొస్తున్నాయి.