https://oktelugu.com/

Director Shankar : ఫ్లాప్ సినిమా సీక్వెల్ రీ షూట్ కోసం 100 కోట్లు ఖర్చు చేయిస్తున్న శంకర్..అసలు ఈయనకి ఏమైంది?

ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 'ఇండియన్ 3 ' షూటింగ్ ని కూడా దాదాపుగా 50 శాతం కి పైగా పూర్తి చేసారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని 'ఇండియన్ 2' ఎండ్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు వేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 09:20 PM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar :  ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల తో సమానమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న దర్శకులలో ఒకడు శంకర్. ఈయన సినిమాలకు ప్రేక్షకులు హీరోని చూసి కదలరు. కేవలం శంకర్ పేరుని చూసి మాత్రమే కదులుతారు. అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న శంకర్, ఈమధ్య కాలంలో కాస్త తడబడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రాలలో ఒకటి ఇండియన్. తెలుగు లో ఈ సినిమా భారతీయుడు పేరుతో విడుదలైంది. కమర్షియల్ గా అప్పట్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సేనాపతి పాత్రని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ‘ఇండియన్ 2’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే.

    శంకర్ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయా?, శంకర్ కూడా ఇలాంటికి పనికిమాలిన సినిమాలు తీస్తాడా? అని ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశని వ్యక్తం చేసాడు. కానీ ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా, ఈ చిత్రానికి మూడు రోజుల వరకు భారీ వసూళ్లు వచ్చాయి. క్లోజింగ్ లో 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ‘ఇండియన్ 3 ‘ షూటింగ్ ని కూడా దాదాపుగా 50 శాతం కి పైగా పూర్తి చేసారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ‘ఇండియన్ 2’ ఎండ్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు వేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా వింటేజ్ శంకర్ మార్క్ టేకింగ్ అంటే, ఇలాంటి కంటెంట్ ని పెట్టుకొని ఇండియన్ 2 ని ఎందుకు విడుదల చేశారు?, నేరుగా ఇండియన్ 3 నే విడుదల చేయాల్సింది కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకున్నారు.

    అయితే ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వడంతో ఇండియన్ 3 ఇక రాదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ‘ఇండియన్ 3’ మూవీ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోని అనేక సన్నివేశాలను శంకర్ రీ షూట్ చేయాలనీ నిర్మాతలను కోరాడట. నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కేవలం ఈ రీ షూటింగ్ కోసమే 100 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుందట. తొలుత ఈ చిత్రాన్ని ఓటీటీ లో డైరెక్ట్ విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ, శంకర్ అందుకు ఒప్పుకోలేదట. ఈ చిత్రాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని తెరకెక్కించి సూపర్ హిట్ ని కొట్టాలి అనే కసితో పని చేయబోతున్నాడట. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే జనవరి 10 న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో వచ్చే నెల మొత్తం శంకర్ బిజీ గా గడపబోతున్నాడు.