Sukumar-Sharukhkhan Movie : బాలీవుడ్ బాద్షాగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు షారుక్ ఖాన్ (Sharukh Khan)… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి. దాంతో ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. అమితాబచ్చన్ (Amitha bachhan ) తర్వాత అంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన ఒక్కడే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి విజయాలను సాధిస్తూ 1000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌజ్ గా పేరు సంపాదించుకున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు చాలా రోజుల నుంచి షారుక్ ఖాన్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఆయనతో సినిమా చేసే అవకాశం వాళ్లకు వనట్టుగా తెలుస్తోంది. దాని కోసమే వాళ్ళు సుకుమార్(Sukumar ) – షారుఖ్ ఖాన్ (Sharukh Khan) కాంబోలో ఒక సినిమా చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటూ గత రెండు సంవత్సరాల నుంచి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ వార్తకి మరింత బలం చేకూరిందనే చెప్పాలి. మరి వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే ఆ సినిమా ఎలా ఉండబోతుంది.
బాలీవుడ్ బాద్షా ఇమేజ్ను రెట్టింపు చేసే విధంగా సుకుమార్ తన ఐడియాలజీ ని ఉపయోగించి ఒక గొప్ప కథను రాస్తాడా..? ఇప్పటికే సుకుమార్ పుష్ప 2 (Pushpa 2) సినిమాతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మరి ఇకమీదట చేబోయే సినిమాలు అంతకుమించి ఉండే విధంగా ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది.
కాబట్టి సుకుమార్ – షారూక్ ఖాన్ కాంబోలో సినిమా రావడం తథ్యం అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన వెట్రీ మారన్ (Vetri Maaran) సైతం షారుక్ ఖాన్ కి ఒక కథను వినిపించాడు. ఇక షారూక్ అతనితో సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి దర్శకుల్లో ఆయన ముందు ఎవరితో సినిమాని స్టార్ట్ చేస్తాడు.
ఎవరు తనకు సక్సెస్ఫుల్ సినిమాని అందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీ (Atlee) తో చేసిన ‘జవాన్ కి (Jawan) సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన సౌత్ దర్శకుల పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరితో అతను మొదట సినిమా చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Director #Sukumar – #ShaRukhKhan – #MythriMovieMakers
Tollywood & Bollywood Next Sambavam pic.twitter.com/dnhNt5q23H
— Movie Tamil (@MovieTamil4) June 10, 2025