Sukumar: ఒక సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న లేదంటే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను తీసుకువచ్చిన దానికి పూర్తి బాధ్యత దర్శకుడే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాసుకున్న కథ స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. అది ప్రేక్షకుడికి నచ్చాలి అప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సినిమాకి దర్శకుడు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే సక్సెస్ దక్కుతుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇండస్ట్రీ లో ఎవ్వరు రాత్రికి రాత్రి సడన్ గా టాప్ హీరోగా మారిపోరు కథలో అతన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే అతనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. అప్పుడే మాత్రమే ఆయన స్టార్ హీరో అవుతాడు. దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు సైతం చాలా మందిని హీరోలుగా, స్టార్ హీరోలుగా మార్చారు. ప్రస్తుతం రాజమౌళి సైతం హీరోలను టాప్ రేంజ్ కి తీసుకెళ్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఒక సినిమా మీద దర్శకుడి యొక్క ప్రాధాన్యత ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ 3 డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆయన చేసిన ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఘనత ఆయన సొంతం…
మరి అలాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటి విషయంలో చాలా వరకు సాటిస్ఫాక్షన్ తో ఉన్నప్పటికి ఒక్క సినిమా విషయంలో మాత్రం ఆయన అంత సంతృప్తి చెందలేదట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే రామ్ హీరోగా వచ్చిన ‘జగడం’ సినిమా కావడం విశేషం… అయితే ఈ సినిమా కథని మొదట మహేష్ బాబు కోసం రాసుకున్నారు.
మహేష్ బాబు ఆ క్యారెక్టర్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సుకుమార్ అనుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఈ కథలోకి రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాంతో సినిమా కథ మొత్తం మారిపోయింది. దాని వల్ల అతను చాలా వరకు కాంప్రమైజ్ అయి సినిమా చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ సినిమా చేయకపోయిన బాగుండేదని సుకుమార్ చాలా సందర్భాల్లో చెప్పేశాడు.
అయితే ఈ సినిమాని చూసిన చాలామంది ఇది ఒక కల్ట్ క్లాసికల్ సినిమా అని అప్పుడు ప్రేక్షకులకు అంత పెద్దగా ఎక్కలేదు. కానీ రాను రాను ఈ సినిమా చూసిన కొద్ది ప్రేక్షకులు దీనికి అభిమానులుగా మారిపోతున్నారని ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే చాలా సినిమాలు వచ్చాయని చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు…
