Ranveer Singh: ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “1983”. టీమిండియా మాజీ సారథి, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 30న విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.
Ranveer Singh 83 Movie
Also Read: టాప్ ప్లేసులోకి ఆస్ట్రేలియా.. టీమిండియా ర్యాంక్ ఎంత?
కబీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఇటీవల జరిగింది. దీంతో రణ్వీర్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రణ్వీర్.. ఈ సినిమా కోసం తనెంతలా కష్టపడ్డాడో వివరించాడు. కపిల్ మేనరిజానికి అలవాటు పడటానికి నాకు సుమారు 6నెలలు పైనే పట్టింది. ముఖ్యంగా ఆయన బౌలింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానికి తోడు నా శరీరం అతని శరీరానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి అతనిలా మారేందుకు నేను నా శరీరాకృతి కూడా మార్చుకోవాల్సి వచ్చింది. కోచ్ నా బాడీని చూసి.. మీరు బౌలింగ్ చేయడానికి వస్తే.. ఎవరో రెజ్లర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నట్లు ఉందన్నాడు. అలా కోచ్ నన్ను నెలపాటు బౌలింగ్‌కు దూరంగా ఉంచాడు. కపిల్‌లా బాడీ తీసురమ్మని చెప్పారు. ఆయనలా మారిన తర్వాతే బౌలింగ్ యాక్షన్ మొదలుపెట్టా.. అని పేర్కొన్నారు.
నేను పూర్తిగా కపిల్ దేవ్‌గా కనిపించేందుకు రోజూ 4 గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడ్ని అలా.. 6 నెలల సమయం పట్టింది. ఆ సమయంలో నాకు చాలా గాయాలయ్యాయి. కానీ, కపిల్ సర్లాగే చేశావంటూ అందరూ అంటూంటే.. ఆ కష్టం కనిపించేది కాదు.. అని రణ్వీర్ వివరించారు. కాగా, రణ్వీర్ గురించి మాజీ క్రికెటర్ కపిల్ మాట్లాడుతూ.. రణ్వీర్ గొప్ప ప్రతిభావంతుడని.. అతిని ఒకర సలహా అక్కర్లేదని అన్నారు.
Also Read: కోహ్లిపై బీసీసీఐ కుట్ర పన్నుతోందా? దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించకపోతే అంతేనా?