Sukumar: ఒక హిట్ మూవీ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. దానిని సక్సెస్ ఫార్ములాగా భావించే దర్శక నిర్మాతలు అదే తరహా చిత్రాలు తెరకెక్కిస్తారు. అయితే ఆ హిట్ కిక్ ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి కూడా ఎక్కుతుంది. ఆ మత్తును దించుకోవడం సామాన్యమైన విషయం కాదు. చాలా మంది దర్శకులు తమకు హిట్ ఇచ్చిన జోనర్, ఫార్ములాను వదులుకోరు.

దానిలో నుండి బయటపడలేరు. అదే వాళ్ళ బలంగా భావించి… మూస ధోరణిలోకి తెలియకుండా జారిపోతారు. దాని వలన ఒకటి రెండు హిట్స్ దక్కినా… తర్వాత ఫలితాలు దారుణంగా ఉంటాయి. అలా దెబ్బైన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. 2005లో విడుదలైన పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది.మాఫియా జోనర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
మహేష్ తో పాటు పూరీకి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టిన పోకిరి, అప్పట్లో ఓ సంచలనం. అయితే దర్శకుడు పూరి కెరీర్ ని పోకిరి చాలా డామేజ్ చేసింది. ఆ ఫార్ములా నుండి ఆయన బయట పడలేకపోయారు. పోకిరి తర్వాత పూరి నుండి వచ్చిన చిత్రాలలో దాదాపు ఇదే తరహా ఫార్ములా, జోనర్ కలిగి ఉండేవి. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, గోలీమార్, బిజినెస్ మాన్ ఇలా అనేక చిత్రాలు పోకిరి తరహాలో పూరి తెరకెక్కించారు.
కథ ఏదైనా మాఫియా ఊసు లేకుండా ఆయన సినిమా ఉండేది కాదు. ఒక దశలో పూరి సినిమాలలో మొనాటమి పెరిగిపోయింది. పాత చిత్రాల కథలనే మార్చి మార్చి తీస్తున్నాడన్న అపవాదు వచ్చింది. దీనితో వరుస ప్లాప్స్, పూరి కెరీర్ ఎవరెస్టు నుండి నేలకి పడిపోయింది. ఇప్పుడిప్పుడే పూరి పోకిరి హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడుతూ.. నూతన జోనర్స్ లో చిత్రాలు చేస్తున్నారు.
Also Read: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు ఘన నివాళి అర్పించిన గూగుల్… ఎమోషనల్ ట్వీట్
పూరి చేసిన తప్పే సుకుమార్ చేస్తున్నాడేమో అన్న సందేహాలు పుష్ప ప్రోమోలు చూశాక కలుగుతుంది. సుకుమార్ పుష్ప చిత్రానికి కూడా రంగస్థలం ఫార్ములా వాడేస్తున్నాడని, అదే తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారన్న మాట వినిపిస్తుంది. సుకుమార్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన రంగస్థలం అనేక నయా రికార్డ్స్ సెట్ చేసింది.
దీనితో ఇదే సక్సెస్ మత్రంగా భావించి సుకుమార్ కూడా పూరి మాదిరి ఓకె ఫార్ములాకు అలవాటు పడుతున్నాడేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. పుష్ప కూడా రివేంజ్ డ్రామా కావడంతో పాటు పీరియాడిక్ కథ అన్నట్లు తెలుస్తుంది. అప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదు,అయితే డిసెంబర్ 17న ఈ విషయంపై స్పష్టత రానుంది.