Sukumar: అల్లు అర్జున్ హీరో గా చాలా సినిమాలు వచ్చాయి ఆయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను కూడా అందుకున్నాయి ముఖ్యంగా ఆర్య, బన్నీ, జులాయి, దేశముదురు, రేసుగుర్రం, అలా వైకుంఠపురం లో రీసెంట్ గా పుష్ప లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో గా పేరు సంపాదించుకున్నాడు.ఇక రీసెంట్ గా పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఆయనకి బెస్ట్ ఆక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఈయన చేసిన ఈ సినిమా హిందీ లో చాలా పెద్ద హిట్ అయింది.అందుకే ఇప్పుడు ఈ సినిమామీద అందరికి చాలా మంచి అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలీదు కానీ ఇప్పటికీ ఈ సినిమా మీద చాలా మంది అటు ఇండస్ట్రీ నుంచి కానీ ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇక సుకుమార్ కూడా ఈ విషయంమీద చాలా సంతోషం గా ఉన్నట్టు గా తెలుస్తుంది ఎవరి ఎన్ని అంచనాలు పెట్టుకున్న సరే వాళ్ల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని చెప్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ టీం మొత్తం ఇప్పటికే నేషనల్ అవార్డు వచ్చిన సంతోషం లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని కూడా భారీ రేంజ్ లో తీసి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ అయితే తప్పకుండాఉంటుంది. ఇక ఈ సినిమాలో ఎలాంటి పాయింట్ పెట్టాడు అనేది చూడాలి నిజానికి ఈయన సినిమాల్లో చాలా వరకు హీరో ఒక డిఫరెంట్ మ్యానరిజంతో ఉంటాడు మనకు పుష్ప లో కూడా ఆయన క్యారెక్టరైజెశన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది.ఇక సుకుమార్ అంటే ఆయన మన ఐక్యూ లెవల్ కి చాలా వరకు పరిక్షలు పెట్టె ఒక డైరెక్టర్ అనే చెప్పాలి. ఆయన ముందు సినిమాలు అయిన వన్ నేనెక్కడినే కానీ, నాన్నకు ప్రేమతో సినిమాలు కానీ చూస్తే మనకు అర్థ అవుతుంది ఆయన ఎంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనేది…
ఇక ప్రస్తుతం పుష్ప 2 మూవీ మీదనే ఆయన ఫోకస్ మొత్తం పెట్టినట్లు గా తెలుస్తుంది.ఈ సినిమా కనక ఇండస్ట్రీ హిట్ కొడితే సుకుమార్ కి ఇక తిరుగు లేదనే చెప్పాలి. ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు…ఇప్పటికే ఆయన సినిమాలు అంటే పడి చచ్చిపోయే అభిమానులు కూడా ఇండియా లో చాలా మందే ఉన్నారు…ఆయన ఏ సినిమాలు తీసిన ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీస్తారు అనే విషయాన్నీ ఆయన చాలా సార్లు చెప్పారు…