https://oktelugu.com/

Rangasthalam: రంగస్థలం సినిమాకి అన్యాయం చేసిన సుకుమార్…దాని వల్ల రామ్ చరణ్ కి భారీ ఎఫెక్ట్ పడిందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు వాళ్ళ మార్కెట్ ని పెంచుకుంటూ భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఉంటారు. అందుకే ఇక్కడ క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా వాళ్ళ స్టార్ డమ్ తో పోలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారో వాళ్ళు స్టార్ హీరోగా గుర్తింపబడతారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 12:16 PM IST

    Rangasthalam

    Follow us on

    Rangasthalam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ తో చేస్తున్న ఈ ప్రయత్నం భారీ లెవెల్లో వర్కౌట్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి పార్టుతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ ని పొందాలని చూస్తున్నాడు. మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడంలో అల్లు అర్జున్ ఎప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమా విషయంలో చాలా వరకు సుకుమార్ నెగ్లెట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా చేస్తే రామ్ చరణ్ కి భారీ గుర్తింపు రావడమే కాకుండా ఈ సినిమాలో నటించినందుకు గాను ఆయనకు తప్పకుండా ‘నేషనల్ అవార్డు’ అయితే వచ్చేది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గానీ ఆయన హావభావాలు గాని, సుకుమార్ డైరెక్షన్ గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక పుష్ప సినిమాతో పోలిస్తే రంగస్థలం సినిమా చాలా బాగుంటుంది. నిజానికి పుష్ప సినిమా తెలుగులో అంత బాగా ఆడలేదు.

    కేవలం బాలీవుడ్ లో మాత్రమే భారీ గుర్తింపును సంపాదించుకుంది. కానీ రంగస్థలం సినిమా మాత్రం తెలుగులో సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఇక మొదటిసారి సుకుమార్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టును కొట్టడం అనేది విశేషం.

    సుకుమార్ ఈ విషయంలో రామ్ చరణ్ కి అన్యాయం చేశారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరోసారి మరొక సినిమా రావడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఈసారి వీళ్ళిద్దరూ కలిసి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే విధంగా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. పుష్ప 2 సినిమాతో సుకుమార్ కూడా భారీ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటాడు. తద్వారా వీళ్ళ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి…