Sujeeth: టాలెంట్ ఉంది కష్టపడి తత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు సక్సెస్ ని సాధిస్తారనే చెప్పాలి… కాకపోతే వాళ్లు సక్సెస్ ని చేరువయ్యే వరకు ఓపికతో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా వరకు సెట్ అవుతుంది… ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా కూడా అవకాశం వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయంలో ఆలోచించాలి. అంతే తప్ప అవకాశం రావట్లేదని బాధపడకూడదు. కాబట్టి సక్సెస్ రావాలంటే ముందు అవకాశం రావాలి. అవకాశం ఎప్పటికైనా వస్తుంది కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగే కెపాసిటి నీ దగ్గర ఉందా లేదా అని ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. దాని కోసం మనం ఏం చేస్తున్నామో ఎలాంటి టాలెంట్ ని కలిగి ఉన్నాం అనేది ఇక్కడ కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది…
ఇక షార్ట్ ఫిలిమ్స్ చేసి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సుజీత్…’రన్ రాజా రన్’ సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన ఆయన తర్వాత ప్రభాస్ తో ‘సాహో’ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించక పోయిన కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశమైతే వచ్చింది.
గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సుజిత్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేస్తారని అందరు అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ నాని తో సినిమా చేయడం పట్ల పలువురు పలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది పెద్ద హీరోల నుంచి ఆఫర్లైతే వచ్చాయి కానీ వాటిని పక్కన పెట్టాడు.
కారణం ఏదైనా కూడా తన సబ్జెక్టుకి నాని అయితేనే బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతోనే అతనితో సినిమా చేస్తున్నానని గతంలో క్లారిటి ఇచ్చాడు… మరి తను ఓజీ సినిమా సక్సెస్ ని పూర్తిస్థాయిలో ఎందుకు వాడుకోలేకపోతున్నాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా తెలుస్తుంది…