మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చిరంజీవి డ్యుయల్ రోల్స్ చేస్తున్నారు. డైనమిక్ ఎండోన్మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై దాదాపు సగం పార్ట్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ సాహో దర్శకుడితో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ హక్కులను సొంత చేసుకున్న తెల్సిందే. ఈ మూవీని తన తండ్రితో రీమేక్ చేయనున్నట్లు చెర్రీ గతంలోనే ప్రకటించాడు. దీంతో ఈ మూవీని రీమేక్ చేసే దర్శకుల విషయంలో పలు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ను రీమేక్ చేసే దర్శకుడిపై క్లారిటీ ఇచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ మూవీని తెరకెక్కించిన ‘సాహో’ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ఇప్పటకే దర్శకుడు సుజిత్ కు తెలిపినట్లు మెగాస్టార్ ప్రకటించారు. సుజిత్ స్ర్కీప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. తెరపైకి ‘సైరా-సాహో’ కాంబినేషన్ రావడంపై ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగులో భారీ హిట్టయినా మిగతా భాషల్లో అనుకున్నంత సాధించలేదు. అలాగే ‘సాహో’ మూవీతో బాలీవుడ్లో భారీ విజయం సాధించినా తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్ కావడం ఆసక్తికరంగా మారింది. ‘సైరా-సాహో’ కాంబినేషన్లో రానున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే..