https://oktelugu.com/

కరోనాను క్యాష్ చేసుకుంటున్న మంత్రులు?

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కరోనా బాధితుల భయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది క్యాష్ చేసుకుండటం శోచనీయంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సరైన చికిత్స అందకపోవడంతో కరోనా బాధితులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అదే అదనుగా భావిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఒక్కో పేషంట్ కు లక్షల్లో బిల్లులు వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోపిడి కట్టడి చేయాల్సిన ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో వారి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 05:37 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కరోనా బాధితుల భయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది క్యాష్ చేసుకుండటం శోచనీయంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సరైన చికిత్స అందకపోవడంతో కరోనా బాధితులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అదే అదనుగా భావిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఒక్కో పేషంట్ కు లక్షల్లో బిల్లులు వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోపిడి కట్టడి చేయాల్సిన ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

    Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?

    ప్రభుత్వ ఆస్ప్రతుల్లో రోగులకు మెరుగైన సదుపాయాల్లేవని ప్రచారం జరుగుతుండటంతో రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని 55ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఒక్కో ఆస్పత్రిలో 50బెడ్ల నుంచి 300ల బెడ్స్ అందుబాటులో ఉంచారు. వీటితోపాటు అనధికారికంగా అనేక ఆస్పత్రుల్లో కరోనా సేవలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనా చికిత్స ఎంత ట్రీట్మెంట్ చేసినా రూ.10నుంచి 15వేలలోపు బిల్లు అవుతుంది. కానీ ఇందుకు భిన్నంగా కరోనా రోగికి ఒక్క రోజుకు చికిత్సకే లక్షల్లో బిల్లు వేస్తుండటం గమనార్హం.

    రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో విరివిగా బయటపడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ కరోనా పేషంట్ కు రూ.17.50లక్షల బిల్లు వేసి షాకిచ్చింది. ఇంత బిల్లు వేసి కూడా కరోనా రోగిని ఆస్పత్రి బృందం కాపాడలేకపోయింది. ఆ రోగి తరుపు బంధువులు అప్పటికే 8లక్షలు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లిస్తేనే శవం ఇస్తామని చెప్పడంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. అయినప్పటికీ మృతుడి బంధువులతో బేరసారాలాడి చివరికీ కొంత బిల్లు కట్టించుకొని శవాన్ని అప్పగించచడం శోచనీయంగా మారింది. హైదరాబాద్లోని పలు ఆస్పత్రులు ఇప్పటికే కరోనా పేషంట్లకు బిల్లుల రూపంలో చుక్కలు చూపిస్తుండటం గమనార్హం.

    Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

    మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ కావాలంటే మంత్రుల సిఫార్సు ఉండాల్సిదేననే టాక్ విన్పిస్తోంది. ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రికి ఎవరో ఒక మంత్రి లేదా రాజకీయ నాయకుడు అండగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి అండతోనే ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నాయట. మంత్రుల కోసం కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేకంగా మూడు నుంచి నాలుగు బెడ్స్ కేటాయిస్తున్నాయట. ఆ బెడ్స్ లో పేషంట్లను నిర్ణయించేది మంత్రులు, వారి పీఏలేనని టాక్ విన్పిస్తుంది. దీంతో రోగులకు మంత్రులు అండగా ఉంటున్నారా? లేక ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహిస్తున్నారనేది అర్థంకావడం లేదనే పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా దోపిడిని అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.