Sujeeth Nani Movie : ‘రన్ రాజా రన్’ (Run Raja Run)సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సుజీత్ (Sujeeth) మొదట షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఆయన వల్ల షార్ట్ ఫిలిమ్స్ తీసే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి కూడా తనే కేంద్ర బిందువుగా మారాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలు హీరోలకు కొత్త స్టైల్ ని కట్టబెడుతున్నాయనే చెప్పాలి. రన్ రాజా రన్ సినిమాతో శర్వానంద్ కి ఒక డిఫరెంట్ స్టైల్ ని అలవాటు చేసిన ఆయన ఆ తర్వాత ప్రభాస్ (Prabhas) తో చేసిన సాహో (Sahoo) సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా తెలుగులో అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించినప్పటికి బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తో ఓజీ (OG) అనే సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.
Also Read : ప్యారడైజ్ లో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్న స్టార్ హీరో…
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటమే దానికి కారణంగా చెబుతున్నారు. మరొక 20 రోజుల పాటు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తన డేట్స్ ని కేటాయించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను కేటాయిస్తాడో అప్పుడు ఈ సినిమా పూర్తి అయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇక ఈ సినిమా లేట్ అవుతుందని సుజీత్ మధ్యలో నానితో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఆ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయింది. ఇక ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నానితో సుజిత్ చేస్తున్న సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
మరి పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే సుజిత్ కి భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. మరి ఆ హైప్ ను ఇప్పుడు వాడుకుంటూ ఆయన ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం స్టార్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడు. లేకపోతే మాత్రం ఆయన తన మార్కెట్ ను భారీగా కోల్పోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు…