Gunasekhar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు సైతం ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పట్లో గుణశేఖర్ (Guna shekar) నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రతి ఒక్కరు అటెన్షన్ తో ఉండేవారు. ఇక ఆయన డైరెక్షన్లో వచ్చిన చూడాలని ఉంది(Chudalani undi), ఒక్కడు (Okkadu) లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక అనుష్క(Anushka) తో చేసిన రుద్రమదేవి (Rudramadevi) సినిమా ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నప్పటికి ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయింది. మరి ఏది ఏమైనా కూడా గుణశేఖర్ లాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), గుణశేఖర్ కాంబినేషన్లో ఎన్టీఆర్ కెరియర్ మొదట్లోనే ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా మిస్ అయింది. నిజానికి గుణశేఖర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఉన్నప్పుడే ‘బాల రామాయణం’ (Bala Ramayanam) అనే సినిమాను చేసి సక్సెస్ ని సాధించాడు. కానీ తను హీరో అయిన తర్వాత మాత్రం అతనితో సినిమా చేయలేకపోయాడు. మధ్యలో కొన్ని సందర్భాల్లో వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు.
Also Read : సుజీత్ నాని మూవీ పట్టలెక్కేది అప్పుడేనా..?
మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అది కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ట్ గా ఎదిగాడు. గుణశేఖర్ ప్రస్తుతానికి సక్సెస్ లు ఏమీ లేకుండా ప్లాప్ ల్లో ఉన్నాడు.
కాబట్టి వీళ్ళ కాంబినేషన్ అనేది వర్కౌట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మార్కెట్ పరంగా చూసుకున్న సక్సెస్ ల పరంగా చూసుకున్న వీళ్ళిద్దరికి అసలు సింక్ అవ్వదు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్లో ఇక సినిమా రాకపోవచ్చు… ఇక మొత్తానికైతే గుణశేఖర్ భారీ సెట్లు వేసి సక్సెస్ లను సాధించడంలో సిద్ధహస్తుడు.
ఇక ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన తంటాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందరలో చేయబోతున్న సినిమాలతో మంచి విజయాలను సాధించి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలను చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…