Paradise Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు నాని(Nan)… ఆయన చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. ఇక రీసెంట్ గా హిట్ 3 (Hit 3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళుతున్న నాని తన తర్వాత సినిమా ను శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్లో చేయబోతున్న ప్యారడైజ్ (Paradaise) సినిమా మీద భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ప్యారడైజ్ సినిమాతో మాస్ ఇమేజ్ ని కొరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయితే కనక నాని టైర్ వన్ హీరోగా మారిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తను టైర్ వన్ హీరోగా మారడానికి ప్యారడైజ్ సినిమానే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో ఆయనతో పాటు మలయాళం నటుడు అయిన రిషబ్ శెట్టి (Rishabh Shetty) కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : మరో వివాదంలో అల్లు అర్జున్, సోషల్ మీడియాలో విమర్శలు, కారణం ఇదే
అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని సినిమా యూనిట్ గోప్యంగా ఉంచుతున్నప్పటికి మొత్తానికైతే ఈ రహస్యాన్ని బయటపెట్టే సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని తన అభిమానాలతో పంచుకునే విధంగా నాని ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. మరి నాని లాంటి నటుడు ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా మీద తన పూర్తి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు.
అందువల్లే ఆయన సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ప్రతి సినిమాకి ఆయనలోని వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అందుకే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తన మనుగడను సాఫీగా కొనసాగించగలుగుతున్నాడు.
ఇక ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరొక లెక్క అనే రేంజ్ లో నాని కెరియర్ సాగుతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చేసిన దసర (Dasara) సినిమాతో మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకున్న నాని మరోసారి ప్యారడైజ్ సినిమాతో ఊర మాస్ అంటే ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక బూతు డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ప్రశాంత్ నీల్ కి ఒక టాస్క్ ఇచ్చిన ఎన్టీఆర్..? ఇదంతా దాని కోసమేనా..?