Suhas : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లి కమెడియన్ గా అవకాశాలు సంపాదించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న తర్వాత సుహాస్(Suhas) ‘కలర్ ఫోటో’ అనే చిత్రంతో హీరో గా మారాడు. లాక్ డౌన్ సమయం లో ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సుహాస్ నటనకు అందరూ ఆశ్చర్యపోయారు, ఇతనిలో ఈ రేంజ్ టాలెంట్ కూడా ఉందా అని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి సంగతి మన అందరికీ తెలిసిందే. ‘కలర్ ఫోటో’ తర్వాత సుహాస్ హీరోగా కొనసాగుతూ, ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. సుహాస్ ఒక సినిమా చేస్తున్నాడంటే, కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది అనే బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించాడు
Also Read : ఓటిటి లో సుహాస్ రియల్ హీరోనా..? ఆయన సినిమా ఓటిటి లో దుమ్మురేపడానికి కారణం ఏంటి..?
అలాంటి సుహాస్ ఇప్పుడు కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేసాడు. తమిళం లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీసిన ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్(Vetrimaaran) మన అందరికీ తెలిసిన వాడే. రీసెంట్ గానే ఆయన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తో ‘విడుదలై’ సిరీస్ తీసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. అంతకు ముందు ఆయన ధనుష్ తో ‘వడా చెన్నై’, ‘అసురన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తీసాడు. ‘అసురన్’ చిత్రానికి అయితే ఆయన ఏకంగా హీరో ధనుష్ కి నేషనల్ అవార్డు వచ్చేలా చేసాడు. అలాంటి స్టార్ డైరెక్టర్ తో పని చెయ్యాలని సౌత్ లో ప్రతీ ఒక్కరికి ఉంటుంది. వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోలు కూడా వెట్రిమారన్ తో సినిమా చేయాలి అనేది తమ డ్రీం అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అలాంటి డైరెక్టర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసాడు సుహాస్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే వెట్రిమారన్ నిర్మాతగా మారి ‘మండాడి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే తమిళ హీరో సూరి ని ఎంచుకున్న వెట్రిమారన్, హీరో తో సమానమైన మరో పాత్ర కోసం సుహాస్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి మతిమారన్ దర్శకత్వం వహిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయితే సుహాస్ క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుంది. ఇంతకాలం కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన సుహాస్, ఈ చిత్రం నుండి తన పరిధి వేరే లెవెల్ కి తీసుకెళ్లొచ్చు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇతను ఏ రేంజ్ లో ఉండబోతున్నాడు అనేది.
Also Read : కలర్ ఫోటో సుహాన్ కష్టాల కడలి వింటే కన్నీళ్లు ఆగవు..