Prakash Raj : ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj), ఒక నటుడిగా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాడు, ఎన్నో ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించాడు. కానీ అనవసరంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇన్ని రోజులు ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం నాశనం చేసుకుంటున్నాడు, కొత్త శత్రువులను క్రియేట్ చేసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనకు సంబంధం లేని అంశాల్లో తలదూర్చి, అనవసరంగా నెగటివిటీ ని మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ ని, ఆయన అభిమానుల్ని తెగ కెలికేసాడు. ఇప్పుడు ఏకంగా తమిళ హీరో విజయ్ ని, ఆయన అభిమానుల్ని కూడా రెచ్చగొడుతున్నాడు. రీసెంట్ గానే ఆయన ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ యూట్యూబ్ ఛానల్ లో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), విజయ్(Thalapathy Vijay) లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.
Also Read : ప్రకాష్ రాజ్ ఊహించని నిర్ణయం.. ఆ యంగ్ హీరోతో కలిసి సరికొత్త ప్రయోగం…
ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే, తన జుట్టు ని బీజేపీ పార్టీ పెద్దల చేతుల్లో పెట్టేసాడు. తిరుమల లడ్డు విషయం లో కల్తీ నిజంగా జరిగి ఉండుంటే, విచారణ జరిపి కల్తీ చేసిన వాళ్ళను శిక్షించండి. ఇక్కడ సనాతన ధర్మం అంశం ఎక్కడి నుండి వచ్చింది?, ఎందుకు బీజేపీ ఎజెండా ని మీ భుజాల మీద వేసుకొని మోస్తున్నారు?, జనాల్లో ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు?. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణమైన రాజకీయ పరిజ్ఞానం ఇంకా రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ గురించి మాట్లాడుతూ ‘విజయ్ గారి తండ్రి తమిళం లో ఒక టాప్ డైరెక్టర్. ఇండస్ట్రీ లోకి విజయ్ ని తీసుకొచ్చి, అతను సక్సెస్ అయ్యేవరకు, ఆడియన్స్ కి రీచ్ అయ్యే వరకు ఎంతో కష్టపడ్డాడు. ఎట్టకేలకు పలు సూపర్ హిట్స్ ని అందుకొని విజయ్ సక్సెస్ అయ్యాడు. తమిళం లో మంచి స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు’.
‘కానీ అతనిలో కూడా నేను రాష్ట్ర సమస్యల పట్ల విజన్ ని కానీ, సంపూర్ణమైన అవగాహనని కానీ చూడలేదు. తమిళనాడు జనాలు అతన్ని ఒక లీడర్ గా చూడడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా సౌత్ కి సంబంధించిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ పై ప్రకాష్ రాజ్ ఈ రేంజ్ కామెంట్స్ చేయడం పై వాళ్ళ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. విజయ్ తో కలిసి ప్రకాష్ రాజ్ ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించాడు. ఇక పవన్ కళ్యాణ్ , ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఓజీ’ చిత్రం పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. త్వరలోనే వీళ్లిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారు మేకర్స్.
Also Read : 30 వ తేదీన ఇండియాకు వస్తాను..మీ లెక్క ఏంటో తెలుస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన!
Vijay’s father launched him and forced him upon the audience until he gained stardom.
But I don’t see any real vision or understanding of public issues in Vijay. I believe many people in Tamil Nadu don’t see him as a credible political leader.
– @prakashraaj pic.twitter.com/7ryKeLTXRR— Telugu Chitraalu (@TeluguChitraalu) May 5, 2025