https://oktelugu.com/

Suhas : ఓటిటి లో సుహాస్ రియల్ హీరోనా..? ఆయన సినిమా ఓటిటి లో దుమ్మురేపడానికి కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భాగమైపోయింది. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఇండియాలో మనదే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుండటం విశేషం... ఇక ఏది ఏమైనా కూడా మన సినిమాలు భారీ రిలీజ్ అవుతూ సక్సెస్ లను సాధిస్తున్నాయి. అందువల్లే మన దర్శకులతో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు ఉత్సాహన్ని చూపిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 22, 2024 / 08:59 AM IST

    Is Suhas a real hero in OTT? What is the reason for his film's OTT?

    Follow us on

    Suhas : ప్రస్తుతం చిన్న సినిమాలు థియేటర్లో ఆడే రోజులు లేకుండా పోయాయి. నిజానికైతే పెద్ద సినిమాలే వారం రోజులు ఆడితే గ్రేట్ అనే రోజులు వచ్చేసాయి. నిజానికైతే ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి రావడంతో చాలామంది జనాలు థియేటర్లోకి వచ్చి సినిమాలు చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన వారం పది రోజుల్లోపే ఆ సినిమాలు ఓటిటి లోకి వస్తున్నాయి. దానివల్ల ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల సినిమా ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూడాలనేది చాలావరకు తగ్గిపోయింది. సినిమా లవర్స్ తప్ప సగటు ప్రేక్షకులు మాత్రం సినిమా థియేటర్ కి రాకపోవడం బాధకరం…ఇక మొత్తానికైతే చిన్న సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలా మంచి పేరు సంపాదించుకుంటున్నాయి. నిజంగా సుహాస్ లాంటి హీరో తను చేస్తున్న చిన్న సినిమాలతో ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక ఆయన సినిమాలు థియేటర్లో ఆడకపోయిన కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో మాత్రం అద్భుతాలను సృష్టిస్తున్నాయనే చెప్పాలి. ఇంకా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా భారీ వ్యూస్ ను సంపాదించుకుంది. నిజానికి ఈ సినిమా థియేటర్లో అంత మంచి పేరు అయితే రాబట్టలేదు. రైటర్ పద్మభూషణ్ సినిమాకి కూడా మంచి ఆదరణ దక్కింది.

    అలాగే తను హీరోగా చేసిన మొదటి సినిమా అయిన ‘కలర్ ఫోటో’ కూడా డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవ్వడం అనేది కూడా భారీ విజయాన్ని సాధించడంతో సుహాస్ ఓవర్ నైట్ లో హీరోగా మారిపోయాడు. మరి ఆయన చాలా కష్టపడుతూ ఇండస్ట్రీలో తన సర్వేవల్ ను కొనసాగించుకుంటూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఓటిటి ప్లాట్ ఫామ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది.

    సగటు ప్రేక్షకుడి దగ్గరికి అతని సినిమాని చేర్చడంలో ఓటిటి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఆయన సినిమాలు ఎక్కువగా మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉంటాయి. కాబట్టి ఆ సినిమాకి ప్రేక్షకుడు ఈజీగా కనెక్ట్ అవుతాడు. దాని వల్ల ఆయన సినిమాలు చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు.

    ఇక మొత్తానికైతే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆయన సినిమాలు రిలీజ్ అయినా వెంటనే భారీ వ్యూస్ ను సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. చిన్న హీరోల్లో ఏ హీరోకి దక్కని క్రేజ్ సుహాస్ కి దక్కుతుండటం విశేషం…