ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతున్న వారిలో సుడిగాలి సుధీర్ ముందు వరసలో ఉన్నాడు. నటుడిగా, యాంకర్ గా, మెంటార్ గా దుమ్ము లేపుతున్నాడు. చేతినిండా షోలతో టెలివిజన్ రంగంలో స్టార్ గా వెలుగొందుతున్నాడు. అయితే.. రెమ్యునరేషన్ విషయాన్ని సినిమా, టీవీ రంగానికి చెందిన వారెవరైనా సీక్రెట్ గా ఉంచుతారు. సాధ్యమైనంత వరకు మూడో కంటికి తెలియకుండా చూస్తారు. అయితే.. తాజాగా సుధీర్ పారితోషికం ఎంతనేది లీకైంది. మరి, ఆ వివరాలు ఏంటన్నది చూద్దాం.
తెలుగు బుల్లితెరను ఫాలో అయ్యేవారిలో.. సుడిగాలి సుధీర్ అంటే తెలియనివారు ఉండరు. అతను చేస్తున్న షోలు అలాంటివి మరి! అదీ ఇదీ అని కాకుండా.. అన్నిట్లోనూ దర్శనమిస్తున్నాడు. అయితే.. సుధీర్ కెరీర్ ఎలా మొదలైందో చాలా మందికి తెలియదు. అతనొక మెజీషియన్ గా.. చిన్న చిన్న మ్యాజిక్కులు చేసుకుంటూ కెరీర్ మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే జబర్దస్త్ షో ప్రారంభం కావడం.. అవకాశం రావడం జరిగిపోయాయి. అయితే.. జబర్దస్త్ స్టేజ్ పై తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడంతో.. సాధారణ కంటిస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగాడు. అప్పటి నుంచీ సుధీర్ ఫేట్ మొత్తం మారిపోయింది.
అయితే.. సుధీర్ కు ఇంత పేరు రావడంలో యాంకర్ రష్మి పాత్ర చాలా ఉందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ.. గాసిప్స్ కోసం జనాలు చెవులు కోసుకోవడం మొదలు పెట్టారు. ఇది గమనించిన వీరిద్దరూ.. మరింతగా రూమర్స్ క్రియేట్ అయ్యేలా చూసేవారు. దీంతో.. ఇద్దరూ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు. ఈ క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో.. మిగిలిన షోలూ సుధీర్ కు రెడ్ కార్పెట్ పరిచాయి. ఢీ షో, పోవే పోరా, లేటెస్ట్ గా శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలకు మెంటార్ గా, హోస్ట్ గా వ్యవహరిస్తూ సత్తా చాటాడు.
ఇదే క్రమంలో సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేశాడు. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపూల జానకీ వంటి చిత్రాల్లో సైడ్ రోల్స్ చేశాడు. అయితే.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో మీరోగా మారాడు. ఆ తర్వాత గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ తో కలిసి ‘త్రీ మంకీస్’లోనూ నటించాడు. అయితే.. ఆశించిన విజయం దక్కలేదు. కానీ.. సుధీర్ క్రేజ్ బుల్లితెరపై పెరిగిందే తప్ప, తగ్గలేదు. ప్రస్తుతం ‘గాలోడు’ సినిమాలో హీరోగా చేస్తున్నారు.
మరి, ఇంతలా పాపులర్ అయిన సుధీర్ రెమ్యునరేషన్ ఎంత? అన్నప్పుడు జబర్దస్త్ షోకు సంబంధించి.. ఒక్క ఎపిసోడ్ కు సుధీర్ టీమ్ కు రూ.5లక్షలు ఇస్తున్నారని తెలిసింది. ఆ విధంగా నెలకు నాలుగు ఎపిసోడ్లకుగానూ సుధీర్ టీమ్ లీడర్ గా 6 లక్షల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఢీ షో నుంచి ఎపిసోడ్ కు లక్షన్నర, శ్రీదేవీ డ్రామా కంపెనీకి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే నెలకు దాదాపు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. మళ్లీ అదనపు ఈవెంట్లకు అదనపు అమౌంట్ వచ్చేస్తుంది. ఇక, సినిమాల్లో నటిస్తే.. రోజుకు 3 లక్షల వరకు తీసుకుంటాడట. హీరోగా చేస్తే 40 లక్షల వరకు డ్రా చేస్తున్నాడని టాక్. మొత్తంగా ఏడాదికి బుల్లి తెర షోల ద్వారా 3 కోట్ల వరకు, సినిమాల ద్వారా కోటిన్నర వరకు అందుకుంటున్నాడని టాక్. అంటే.. అటూ ఇటుగా ఏడాదికి అతని మొత్తం సంపాదన 4 నుంచి 5 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని తెలుస్తోంది.