Gaalodu Collections: బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో కమెడియన్ గా విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్..అందరూ ఈయనని బుల్లితెర పవర్ స్టార్ అని పిలుస్తారు..ఎందుకంటే ఇతనికి అంతటి క్రేజ్ ఉంది అన్నమాట..అయితే ఇలాంటి ఆర్టిస్ట్స్ కేవలం బుల్లితెర కి మాత్రమే పరిమితం..హీరో గా వస్తే ఆదరించరు అని అంటుంటారు విశ్లేషకులు..షకలక శంకర్ కూడా ఇలాగే హీరో గా ట్రై చేసి కెరీర్ ని నాశనం చేసుకున్నాడు..సుడిగాలి సుధీర్ కూడా అదే పొరపాటు చేస్తున్నాడు, కెరీర్ నాశనం చేసుకుంటున్నాడు అని అందరు అనుకున్నారు.

కానీ సుధీర్ మొదటి సినిమా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టాక్ రాకపోయినా కూడా యావరేజి గ్రాసర్ గా నిలిచింది..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరోగా నటించిన ‘గాలోడు’ మూవీ విడుదలైంది..టీజర్ మరియు ట్రైలర్ ఏది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు..సినిమా విడుదల చేసి ప్రింట్ ఖర్చులు దందాగా అని అనుకున్నారు..కానీ అనూహ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా ఓపెనింగ్స్ ప్రతి చోట దుమ్ము లేపేసింది.
తనకి ఉన్న క్రేజ్ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాదు..ఆ క్రేజ్ ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించే రేంజ్ అని ఈరోజు గాలోడు మూవీ ఓపెనింగ్స్ చూస్తే అర్థం అవుతుంది..విడుదలైన ప్రతి చోట మార్నింగ్ షోస్ కి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..ఉత్తరాంధ్ర వంటి ప్రాంతం లో అయితే కేవలం మార్నింగ్ షోస్ నుండి సింగల్ స్క్రీన్స్ లో పది లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే సుధీర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..ఈ స్థాయి వసూళ్లు ఇండస్ట్రీ లో మా కుటుంబమే తోపు అనుకుంటున్న ఎంతోమంది వారసులకు కూడా ఈమధ్య రాలేదు.

సినిమాకి కూడా పర్వాలేదు అనే రేంజ్ టాక్ రావడం తో వీకెండ్ మొత్తం ఓపెనింగ్స్ అదిరిపోతాయి..ఈ చిత్రం థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..ఆ బిజినెస్ మొత్తాన్ని ఈ చిత్రం వీకెండ్ లోపే రికవర్ చేసి బ్రేక్ ఈవెన్ అవలీలగా అయిపోతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..మొదటి రోజు ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.