Bunny Vasu: బన్నీ వాసుని చూస్తే జాలేస్తుంది. ఏళ్లుగా బోయ సునీత అనే సమస్య ఆయన్ని వెంటాడుతుంది. కొన్నాళ్లుగా ఆమె గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదురు ధర్నాలు చేయడం పోలీసులు రంగంలోకి దిగి అక్కడ నుండి తరలించడం నిత్యకృత్యంగా మారింది. ఆమె హైడ్రామా తరచుగా మీడియాలో హైలెట్ అవుతుంది. దీంతో బోయ సునీతకు నిర్మాత బన్నీ వాసు అన్యాయం చేశాడంటూ కథనాలు తెరపైకి వస్తున్నాయి. బోయ సునీతతో బన్నీ వాసుకి నిజంగా పరిచయం ఉందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. తనని లైంగికంగా వాడుకున్నాడు. కొన్నాళ్ల పాటు నాతో సహజీవనం చేశాడని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికి పలుమార్లు ఆమె మీడియా ముందుకు వచ్చారు. తాజాగా గత రాత్రి ఆమె ఏకంగా నగ్న ప్రదర్శన చేశారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట దుస్తులు తొలగించి బైఠాయించారు. అక్కడున్న సెక్యూరిటీ ఎంత వారించినా ఆమె కదల్లేదు. బన్నీ వాసుపై ఆరోపణలు చేస్తూ రచ్చ చేశారు. మహిళా కానిస్టేబుల్స్ రంగంలోకి దిగి ఆమెను అక్కడి నుండి తరలించారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో బోయ సునీత చికిత్స తీసుకున్నారు. ఆమెకు ఇదో డిజార్డర్ అని డాక్టర్స్ తేల్చారట.
ఆమె మానసిక స్థితి సరిగా లేని క్రమంలో బన్నీ వాసునే టార్గెట్ చేయడానికి కారణం ఏమిటీ? ఇంకెవరిపై ఆమె ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయడం లేదన్న సందేహాలు మొదలవుతున్నాయి. కాగా బన్నీ వాసుతో పాటు ఒకరిద్దరు ఈ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. వారు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారట. అలా అని లక్షల్లో ఏమీ ముట్టజెప్పలేదు. వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారట.

మరి ఆ మాత్రం బన్నీ వాసు సెటిల్ చేయలేకపోతున్నాడా అంటే… ఆయన ఫస్ట్ లోనే రాంగ్ స్టెప్ వేశాడు. పోలీసులు, కేసులు వంటి మార్గం ఎంచుకోవడం దీనికి కారణం అంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు వచ్చిన బోయ సునీత మానసిక స్థితికి బలమైన కారణాలు ఉండవచ్చు. నగ్న ప్రదర్శనలకు కూడా సిద్ధమైన బోయ సునీత సమస్య బన్నీకి వదిలే మార్గం కనపడటం లేదు. రాను రాను ఆమెను ఈ సమస్య మరింతగా వేధించే సూచనలు కలవు.