https://oktelugu.com/

Sudigali Sudheer: రష్మీ క్రేజ్ ముందు సుడిగాలి సుధీర్ తుస్… ఇవిగో లెక్కలు, స్టార్ యాంకర్ కుమ్మేసింది!

సుడిగాలి సుధీర్ కి ఇది మామూలు షాక్ కాదు. తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మీ గౌతమ్ ముందు అతడు తేలిపోయాడు. టీఆర్పీలో రష్మీ షో కంటే సుడిగాలి సుధీర్ షో వెనకబడింది. ఇది అనూహ్య పరిణామం అని చెప్పవచ్చు. ఇటీవల బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన సుధీర్ ని రష్మీ గౌతమ్ దెబ్బేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 31, 2024 / 05:26 PM IST

    Sudigali Sudheer

    Follow us on

    Sudigali Sudheer: యాంకర్ రష్మీ గౌతమ్ పేరు చెబితే మనకు సుడిగాలి సుధీర్ తో నడిపిన లవ్ ట్రాక్ టక్కున గుర్తొస్తుంది. అప్పట్లో రష్మీ – సుధీర్ జంటకు బుల్లితెర పై ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. వీళ్లు పండించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అవ్వని వారు ఉండరు. అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ లో భాగమే అయినప్పటికీ చూసే వాళ్ళకు నిజమైన ప్రేమ అనే భావన కలుగుతుంది. అంతలా ఈ జంట మెస్మరైజ్ చేసింది. బుల్లితెర కెమిస్ట్రీ వారిద్దరి కెరీర్స్ కి కూడా ప్లస్ అయ్యింది.

    ముఖ్యంగా సుడిగాలి సుధీర్ బుల్లితెర సెన్సేషన్ గా అవతరించాడు. బుల్లితెర స్టార్ గా వచ్చిన ఫేమ్ తో హీరో అయ్యాడు. కొన్నాళ్ళు స్మాల్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేశాడు. వరుసగా ఒకటి రెండు చిత్రాలు చేశాడు. సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వదిలేశాక ఆ బాధ్యతలు రష్మీ భుజాలపై వేసుకుంది. ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలను తన యాంకరింగ్ తో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. దశాబ్దకాలంగా టాప్ యాంకర్స్ లో ఒకరిగా రష్మీ హవా సాగిస్తుంది. కళ్ళు తిప్పుకోలేని అందం, ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

    ప్రస్తుతం రష్మీ ముందు సుధీర్ క్రేజ్ ఏమాత్రం పని చేయడం లేదు. రష్మీ ఎదుట సుధీర్ తేలిపోతున్నాడు. బుల్లితెర పై సత్తా చాటలేకపోతున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్… ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే షోకి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ కి యూత్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న పాపులారిటీ కి ఆ షో చెప్పుకోదగ్గ టీఆర్పీ రాబట్టాల్సింది. కానీ లేటెస్ట్ టీఆర్పీ సర్వేలో రష్మీ కంటే సుధీర్ వెనుకబడిపోవడం గమనార్హం.

    రష్మీ యాంకర్ గా చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కి రూరల్ లో 3. 94 రేటింగ్ వచ్చింది. కాగా సుధీర్ ఫ్యామిలీ స్టార్స్ కి 3. 57 రేటింగ్ సాధించింది. ఇక అర్బన్ లో శ్రీదేవి డ్రామా కంపెనీకి 5 టీఆర్పీ రేటింగ్ నమోదైంది. సుధీర్ షోకి కేవలం 2. 9 రేటింగ్ వచ్చింది. ఫ్యామిలీ స్టార్స్ లో సుధీర్ అంతగా ఎంటర్టైన్ చేయపోతున్నాడని .. పైగా షో కాన్సెప్ట్ కూడా ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావడం లేదని అంటున్నారు.

    ఓటీటీలో సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ షో కి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ షో టాప్ టీఆర్పీ తో దూసుకుపోతుంది. సుధీర్ కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. బుల్లితెర పై మాత్రం సుధీర్ ప్రభావం చూపలేకపోతున్నాడు. ఫ్యామిలీ స్టార్స్ లో ఫన్ కంటే కూడా ఎమోషనల్ డ్రామా ఎక్కువగా కనిపిస్తుంది. షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. అందుకే ఆడియన్స్ సుధీర్ షో ని పెద్దగా పటించుకోవడం లేదు.

    మరోవైపు రష్మీ మాత్రం రెట్టింపు జోష్ తో ముందుకు వెళ్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది ఉండటం కూడా కలిసొచ్చే అంశం. మరోవైపు రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. అవి వైరల్ అవుతున్నాయి.