Sudigali Sudheer Controversy: సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) హీరోగా ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. గాలోడు రూపంలో హిట్ పడినా బ్రేక్ మాత్రం రాలేదు. మరలా ఆయన యాంకర్ గా బిజీ అవుతున్నాడు. అయితే జబర్దస్త్ కి ఆయన తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అసలు మల్లెమాల వారు ప్రొడ్యూస్ చేసే ఈ షోలో సుధీర్ భాగమయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఈ క్రమంలో మల్లెమాల సంస్థతో సుధీర్ కి ఎక్కడ చెడింది? మనస్పర్థలు తలెత్తాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
సుడిగాలి సుధీర్ అంటే మొదట గుర్తొనిచ్చేది జబర్దస్త్(Jabardasth). ఈ లెజెండరీ కామెడీ షో పలువురు సామాన్యులను స్టార్స్ ని చేసింది. అనసూయ, రష్మీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. వృత్తిరీత్యా మెజీషియన్ అయిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి రాకముందు అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. జబర్దస్త్ అతని ఫేట్ మార్చేసింది. టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి లీడర్ అయ్యాడు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ తో కూడిన సుడిగాలి సుధీర్ టీం జబర్దస్త్ ని ఏలింది.
Also Read: కింగ్ డమ్ సినిమా విజయ్ కెరియర్ ను డిసైడ్ చేస్తుందా..?
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఢీ యాంకర్ గా సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్ ఎంట్రీతో ఢీ షో భారీ ఆదరణ దక్కించుకుంది. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం సందడి చేశాడు. మల్లెమాలకు సుధీర్ బంగారు బాతులా మారాడు. కారణం తెలియదు కానీ… ఢీ నెక్స్ట్ సీజన్లో సుధీర్ కనిపించలేదు. సుధీర్, రష్మీలను తొలగించారు. హీరోగా ప్రయత్నాలు చేస్తున్న సుధీర్… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు కూడా స్వస్తి పలికాడు. మూవీ ప్రమోషన్స్ లో సుధీర్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇకపై జబర్దస్త్ చేయరా? మల్లెమాల సంస్థతో విభేదాలు తలెత్తాయా? అని మీడియా ప్రశ్నించింది.
మల్లెమాలతో తనకు ఎలాంటి విబేధాలు లేవన్న సుధీర్.. వారి అనుమతి తీసుకునే బయటకు వచ్చాను అన్నాను. తిరిగి జబర్దస్త్ చేసే అవకాశం ఉంది. నాతో ఓ కొత్త షో ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్పాడు. యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఇతర ఛానల్స్, ప్రోగ్రామ్స్ లో పని చేస్తున్నాడు. మల్లెమాల సంస్థ నిర్మిస్తున్న ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు వెళ్లడం లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే మల్లెమాలతో సుధీర్ కి చెడిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read: రవితేజ చేసిన సినిమాల్లో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?
కాగా జబర్దస్త్ మొదలై 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. జబర్దస్త్ లో పని చేసిన వారందరూ ఈ షోలో పాల్గొన్నారు. చివరికి మల్లెమాల సంస్థ మీద తీవ్ర విమర్శలు చేసి, జబర్దస్త్ నుండి తప్పుకున్న నాగబాబు సైతం వచ్చారు. సుధీర్ మాత్రం హాజరుకాలేదని తెలుస్తుంది. సదరు రీ యూనియన్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదల చేయగా, సుధీర్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇకపై మల్లెమాల నిర్మించే ఏ షోలో సుధీర్ కనిపించకపోవచ్చనే చర్చ మొదలైంది.