https://oktelugu.com/

Jabardast: జబర్దస్త్ నుండి సుధీర్​ ఔట్.. కారణం ఇదే!

Jabardast: ఇటీవల కాలంలో కామెడీ షోలకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఇందుకు పెద్దపీట వేసింది మాత్రం జబర్దస్త్​. ఈ షోతో ఎంతో మంది కమెడియన్లు, టెక్నిషియన్లు ప్రస్తుతం మంచి పొజిషన్​లో ఉన్నారు. ఎన్నో ఆశలతో సినీ కళామతల్లి ఒడిలో అడుగుపెట్టి.. తమకున్న ట్యాలెంట్​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించేందుకు ఈ ప్లాట్​ఫామ్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ జబర్దస్త్​ ద్వారా పేరు గణించి.. సినిమాల్లో అవకాశాలు పొందిన ఆర్టిస్టులు చాాలా మంది ఉన్నారు. మరోవైపు, సినిమాల్లో ఛాన్స్​లు లేకపోతే.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 14, 2021 / 03:04 PM IST
    Follow us on

    Jabardast: ఇటీవల కాలంలో కామెడీ షోలకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఇందుకు పెద్దపీట వేసింది మాత్రం జబర్దస్త్​. ఈ షోతో ఎంతో మంది కమెడియన్లు, టెక్నిషియన్లు ప్రస్తుతం మంచి పొజిషన్​లో ఉన్నారు. ఎన్నో ఆశలతో సినీ కళామతల్లి ఒడిలో అడుగుపెట్టి.. తమకున్న ట్యాలెంట్​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించేందుకు ఈ ప్లాట్​ఫామ్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ జబర్దస్త్​ ద్వారా పేరు గణించి.. సినిమాల్లో అవకాశాలు పొందిన ఆర్టిస్టులు చాాలా మంది ఉన్నారు. మరోవైపు, సినిమాల్లో ఛాన్స్​లు లేకపోతే.. షో ద్వారా ఫేమస్​ అవుతున్నవారూ ఉన్నారు.

    ఈ క్రమంలోనే ఎంతో కష్టపడి తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు సుడిగాలి సుధీర్​. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్​లో ఉంది. కమెడియన్​గానే కాకుండా.. పలు షోలకు హోస్ట్​గానూ వ్యవహరించి తనదైన స్టైల్​లో ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం ఎక్స్​ట్రా జబర్దస్త్​లో చేస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇకపై జబర్దస్త్​లో సుధీర్​ కనిపించడట. ఈ షోకు గుడ్​బై చెప్పేసినట్లు తెలుస్తోంది.

    ఏటా మల్లెమాల ప్రొడక్షన్స్​ ఆర్టిస్టులతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్​లో చేస్తున్నవాళ్లు వేరే టీవీ షోల్లో చేయకూడదనే నిబంధన కూడా ఉంది. కాగా, ఈ అగ్రిమెంటును గతంలో బ్రేక్ చేసిన ముక్కు అవినాష్​.. మల్లెమాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లించారు. ఈ క్రమంలోనే సుధీర్​ కూడా అగ్రిమెంటు కొనసాగింపులో ఆసక్తి చూపడం లేదని సమాచారం. వరుసగా సినిమాల్లో హీరోగా, కమెడియన్​గా ఛాన్స్​లు వస్తున్న క్రమంలో.. షోను, సినిమాను బ్యాలెన్స్​ చేయలేక అగ్రిమెంటును క్యాన్సిల్​ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై సుడిగాలి సుధీర్ నుంచి గానీ, జబర్దస్త్ నిర్వహకుల నుంచి కానీ, ఎటువంటి ప్రకటన రాలేదు.