Sudigali Sudheer: ఈటీవీ జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ కు స్పెషల్ స్థానం ఉంది. సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ అడ్రెస్ జబర్దస్త్ కామెడీ షో అనేంత లెవల్ కు ఎదిగి పోయాడు. జబర్దస్త్ కు ముందు సుడిగాలి సుధీర్ అంటే ఎవరో కూడా తెలియదు. జబర్దస్త్ షో ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సుధీర్. ఈయన ముందు మెజీషియన్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ గా అయ్యాడు.

సుధీర్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు సుధీర్. అయితే సుధీర్ ను మల్లెమాల పక్కన పెడుతుందేమో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చుస్తే ఎవ్వరైనా ఇదే అర్ధం చేసుకుంటారు. ఇతడు స్టార్ గా ఎదగడంలో మల్లెమాల కీలక పాత్ర పోషించింది.
మల్లెమాల ఇచ్చిన అవకాశాల కారణంగానే సుధీర్ ఈ రోజు ఒక స్టార్ గా ఎదిగాడు. వారు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ కెరీర్ లో నిలదొక్కుకున్నాడు. అంతేకాదు సుధీర్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. అందులోను మల్లెమాల ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి. అయితే నీరు పోసి పెంచిన వారికే మొక్కను కొట్టే అధికారం కూడా ఉంటుంది అని చెబుతారు.
ఇప్పుడు సుధీర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సుడిగాలి సుధీర్ ను మల్లెమాల పక్కన పెడుతుందేమో అనే అనుమానాలు రోజురోజుకూ పెరుగు తున్నాయి. ఎందుకంటే జబర్దస్త్ షో నుండి సుధీర్ వెళ్లి పోతున్నాడు అనే రూమర్స్ గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. అలాంటిది ఏమి లేదని తమ స్కిట్ తో క్లారిటీ ఇచ్చిన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూసి మళ్ళీ రూమర్స్ మొదలు అయ్యాయి.
Also Read: త్రివిక్రమ్ రాసిన గొప్ప డైలాగ్స్ ఇవే !
అయితే ఇది రూమర్స్ మాత్రమే కాదని ఇప్పుడిప్పుడే స్పష్టం అవుతుంది. మెల్లగా సుధీర్ ను సైడ్ చేస్తుంది మల్లెమాల. ఈటీవీలో ఏ కార్యక్రమం కరిగిన సుధీర్ ఖచ్చితంగా ఉండేవాడు. ఆయన లేకుండా ఈవెంట్ జరిగేదే కాదు. ప్రేక్షకులు కూడా సుధీర్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు అనే స్థాయికి ఈయన వెళ్ళిపోయాడు. అయితే తొలిసారి సుధీర్ లేని ప్రోమోలు వేస్తున్నారు మల్లెమాల టీమ్.
ఈవెంట్స్ జరుగుతున్నాయి.. వాటికీ సంబందిచిన ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఢీ 14 నుండి సుధీర్, రష్మీ బయటకు నెట్టేసింది మల్లెమాల. రెమ్యునరేషన్ విషయంలో తేడాలు వచ్చి బయటకు వచ్చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సుధీర్ స్థానంలో బిగ్ బాస్ అఖిల్ సార్ధక్ వచ్చాడు. ఇటీవలే విడుదల అయినా న్యూ ఇయర్ పార్టీలో కూడా సుధీర్ కనిపించక పోవడంతో మల్లెమాల ఖచ్చితంగా సుధీర్ ను పక్కన పెట్టేసింది అనే ఊహాగానాలకు ఊతం ఇచ్చినట్టు అయ్యింది. ఈ పార్టీలో కూడా సుధీర్ స్థానంలో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న సుధీర్ బదులుగా అఖిల్ ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అభిమానులు ఈ విషయాన్నీ జీర్ణించు కుంటారో లేదో వేచి చూడాల్సిందే..
Also Read: మూడో వారంలోనూ ‘అఖండ’ ప్రభంజనమే !