Sridevi Soda Center movie Review: సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ రివ్యూ

Sridevi Soda Center movie Review: హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇప్పటికే అమెరికాలో , ఓవర్సీస్ లో ఈ షోలు పడ్డాయి. అక్కడి ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ ఒపినీయర్ ను పంచుకుంటున్నారు. పలాస మూవీ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆనంది హీరోయిన్ గా నటించింది. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, […]

Written By: Raghava Rao Gara, Updated On : August 27, 2021 6:11 pm
Follow us on

Sridevi Soda Center movie Review: హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇప్పటికే అమెరికాలో , ఓవర్సీస్ లో ఈ షోలు పడ్డాయి. అక్కడి ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ ఒపినీయర్ ను పంచుకుంటున్నారు. పలాస మూవీ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆనంది హీరోయిన్ గా నటించింది. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శవి దేవిరెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఆగస్టు 27న శుక్రవారం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కథ:
ఒక అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి శ్రీదేవి (హీరోయిన్ ఆనంది). తన గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సూరిబాబు (హీరో సుధీర్ బాబు)ను ప్రేమిస్తుంది. అమ్మాయి కులానికి చెందిన ఒక ఊరిలోని పెద్దమనిషి వీరి ప్రేమను వ్యతిరేకిస్తాడు. హీరోయిన్ తండ్రిని వీరి ప్రేమకు వ్యతిరేకంగా రెచ్చగొడుతాడు. మరోవైపు సూరిబాబు తమ ప్రేమను వ్యతిరేకించిన కుల వర్గానికి వ్యతిరేకంగా గొడవపడి జైలుకు వెళతాడు. కోర్టులో సూరిబాబును నిర్ధోషిగా ప్రకటించబోతున్నప్పుడు కథ మలుపు తిరుగుతుంది. అతడు జైలుకు తిరిగి వెళతాడు. తీవ్రమైన ట్విస్టులతో కథ షాకింగ్ క్లైమాక్స్ కు చేరుతుంది.

-విశ్లేషణ:
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ కథ గ్రామాల్లోని పగలు ప్రతీకారాలు, కులపోకడలపై సంధించినది.కులాంతర ప్రేమ కథా నేపథ్యం ఇదీ.. భారతీయ సినీ తెరలపై చాలా కథలు ఇలాంటివి వచ్చాయి. కానీ ఈ చిత్ర ప్రధాన కంటెంట్ ‘పావ కథైగల్’ అనే చిత్రాన్ని పోలి ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్, సాయిపల్లివి నటించారు. దర్శకుడు కరుణ కుమార్ మొదటి చిత్రం ‘పలాస’లో వాస్తవికంగా గ్రామాల్లో జరిగే కక్షలు చూపించాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు. తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ మొదటి సగ భాగం చాలా చక్కగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తో కథ మొత్తం మారిపోతుంది. ఈ సినిమాకు నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. కాస్త కమర్షియల్ హంగులు జోడించడానికి వినోదం పంచడానికి బాగానే ప్రయత్నాలు చేశారు.

సెకాండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. శ్రీదేవి తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. విలన్ కాశీ క్రూరత్వం తర్వాత సురిబాబు ప్రతీకారం మొదలుపెడుతాడు. ఈ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కులాలపై పేల్చిన డైలాగులు ఆకట్టుకుంటాయి. మణిశర్మ సంగీత సినిమాకు కొంత ప్లస్ అయ్యింది.

సూరిబాబుగా సుధీర్ బాబు నటన యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిన తీరు ప్రశంసనీయంగా ఉంది. అర్బన్ హీరో అయినా గ్రామీణ యువకుడి పాత్రలో బాగా నటించాడు. భావోద్వేగ సన్నివేవాలలో బాగా నటించాడు. శ్రీదేవిగా ఆనంది బాగా సరిపోయింది. నరేశ్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్ పాత్రలు ఆకట్టుకుంటాయి.

-తీర్పు:
‘శ్రీదేవి సోడాసెంటర్’ ఒక తీవ్రమైన కులాల కుంపట్లతో సాగిన చిత్రం. కులాంతర ప్రేమకథ చేసుకున్న గ్రామీణ జంట పడ్డ కష్టాలు ట్విస్టులు, క్లైమాక్స్ వరకూ నడిపించారు. సాంకేతిక విలువలు, తీయడం బాగానే ఉంది. సంభాషణలు ఆకట్టుకుంటాయి. కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ ఈ నెమ్మదిగా సాగే చిత్రం కొంచెం మాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా ఉంది. ప్రేమికులను మెప్పించే చిత్రంగా మాత్రమే నిలుస్తుంది. మూవీలు బాగా చూసే వాళ్లకే సినిమా నచ్చేలా ఉంది.

oktelugu.com రేటింగ్: 2.5/5