E-Shram Portal: మోదీ సర్కార్ తీపికబురు.. ఇలా చేస్తే రూ.2 లక్షల బెనిఫిట్..?

e-Shram Portal: ర్వేరు వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చటానికి వేర్వేరు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా మోదీ సర్కార్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కొత్త పోర్టల్ ను లాంచ్ చేసింది. ఇశ్రమ్ వెబ్‌సైట్ ను మోదీ సర్కార్ అందుబాటులోకి తీసుకొని రాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తునన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 27, 2021 12:32 pm
Follow us on

e-Shram Portal: ర్వేరు వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చటానికి వేర్వేరు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా మోదీ సర్కార్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కొత్త పోర్టల్ ను లాంచ్ చేసింది. ఇశ్రమ్ వెబ్‌సైట్ ను మోదీ సర్కార్ అందుబాటులోకి తీసుకొని రాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తునన్ సంక్షేమ పథకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా పొందే అవకాశాలు ఉంటాయి. ప్రమాదంలో అంగవైకల్యం బారిన పడినా కూడా లక్ష రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ కావడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ వివరాలను అందజేయడం ద్వారా స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత యూఏఎన్ నంబర్ ను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో చేరని సంఘటిత కార్మికులు వెంటనే రిజిష్టర్ చేయించుకుంటే మంచిది. అసంఘటిత కార్మికులకు ప్రయోజనం కేంద్రం కొత్త స్కీమ్ లను అమలు చేస్తుండటంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.