Homeఎంటర్టైన్మెంట్Vikrant Rona OTT Release Date: 'విక్రాంత్ రోనా' OTT విడుదల తేదీ వచ్చేసింది

Vikrant Rona OTT Release Date: ‘విక్రాంత్ రోనా’ OTT విడుదల తేదీ వచ్చేసింది

Vikrant Rona OTT Release Date: మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియన్ సినిమాలు వరుసగా కలెక్షన్ల సునామిని సృష్టించిన తర్వాత విడుదలైన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి..ఆడియన్స్ OTT కి అలవాటు పడడం మాత్రమే కాకుండా, సరైన కంటెంట్స్ కూడా రాకపోవడం తో ఆడియన్స్ థియేటర్ వైపు కూడా చూడడం మానేశారు..స్టార్ హీరోల సినిమాలు మహా అయితే వీకెండ్ లేదా పది రోజులు ఆడుతున్నాయి..కానీ మీడియం హీరోల పరిస్థితి అయితే మరీ నీచం గా తయారు అయ్యింది..హిట్ టాక్ వచ్చినవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే..యావేరేజి రేంజ్ లో ఉన్న సినిమాలు మాత్రం డిజాస్టర్ రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి..ఇది నిజంగా ఇండస్ట్రీ కి గడ్డుకాలం అనే చెప్పాలి..అలాంటి సమయం లో కాస్త ఊరటని కలిగే స్థాయి హిట్ ని అందుకున్న చిత్రం కన్నడ హీరో సుదీప్ నటించిన పాన్ ఇండియన్ మూవీ విక్రాంత్ రోనా చిత్రం అని చెప్పొచ్చు..ట్రైలర్ మరియు టీజర్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా కంటెంట్ విడుదల తర్వాత కూడా మొదటి రోజు మొదటి ఆట నుండే ఆ అంచనాలను అందుకొని సక్సెస్ అయ్యింది.

Vikrant Rona OTT Release Date
sudeep

భారీ బడ్జెట్ తో ఆసక్తికరమైన కథ మరియు కథనం తో తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 45 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..కన్నడ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు అంటే మాములు విషయం కాదు..అంతే కాకుండా తెలుగు లో కూడా ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరింది..కేవలం కోటి రూపాయలకే ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం..మొదటి రోజే ఆ కోటి రూపాయిలను వసూలు చేసి సంచలనం సృష్టించింది..అలా లాంగ్ వీకెండ్ ముగిసేలోపు ఈ సినిమా 3 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

Also Read: Chiranjeevi – Pawan Kalyan: చిరంజీవి కోసం పేరు మోసిన రౌడీ షీటర్ ని చితకబాదిన పవన్ కళ్యాణ్

Vikrant Rona OTT Release Date
sudeep

అంటే పెట్టిన డబ్బులుకంటే మూడింతలు ఎక్కువ లాభాల్ని తెచ్చి పెట్టింది అన్నమాట ఈ సినిమా..ఇది కాసేపు పక్కన పీడిస్తే ఈ సినిమా OTT స్ట్రీమింగ్ ఈ నెలలోనే జరగబోతున్నట్టు సమాచారం..ఈ సినిమా OTT హక్కులను భారీ రేట్ తో అన్ని ప్రాంతీయ భాషలకు దక్కించుకుంది zee5 ..అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు OTT లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు..అనగా ఈ నెలలోనే ఈ సినిమా జీ 5 లో మనకి అందుబాటులోకి రానుంది..సినిమా థియేటర్స్ లో మిస్ అయినా ప్రేక్షకులు OTT లో చూడడానికి సిద్ధంగా ఉండండి.

Also Read:Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఆ హీరోయిన్లను వాడుకున్నాడా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular